NTR Death Anniversary : ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఇవే

తెలుగువారి ఆరాధ్య దైవం, నవరస నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు చనిపోయి ఇప్పటికి 28 ఏళ్లు గడుస్తోంది. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంతకాలం ఆయనను సినీ ప్రేమికులు దేవుడిగా కొలుస్తూనే ఉంటారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ బ్రతికి ఉన్నప్పుడు జరిగిన ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ కు, సూపర్ స్టార్ కృష్ణకు మధ్య సినిమాల విషయంలో విభేదాలు తలెత్తాయి అన్న విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు తీశారు అనే విషయంలోకి వెళ్తే…

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “అల్లూరి సీతారామరాజు” సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ పాత్రలో కృష్ణ ఎంతలా జీవించారంటే అల్లూరిగా ఆయనను తప్ప మరొకరిని ఇప్పటికీ ఊహించుకోలేరు మూవీ లవర్స్. స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్ చేద్దామని అనుకున్నారట. 1955 లోని అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీద్దామని ఆ పాత్రకు సంబంధించిన గెటప్ లో కొన్ని ఫోటోషూట్స్ కూడా ఆయన చేశారట. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దీంతో ఏఎన్ఆర్ తో ఈ మూవీని తీద్దామని దర్శకులు ప్రయత్నించారట. కానీ ఎన్టీఆర్ చేద్దామనుకున్న మూవీ కావడంతో ఏఎన్ఆర్ దాన్ని వద్దన్నారు. ఆ తర్వాత శోభన్ బాబు దగ్గరికి కూడా ఈ మూవీ వెళ్లగా బడ్జెట్ కారణాల దృష్ట్యా లైట్ తీసుకున్నారు. అలా చివరకు సూపర్ స్టార్ కృష్ణ చేతికి రాగా, రామచంద్రరావు దర్శకుడిగా ఆ రోజుల్లోనే 25 లక్షల భారీ బడ్జెట్ తో దాదాపు 38 రోజుల్లోనే “అల్లూరి సీతారామరాజు” సినిమాను చేశారు. ఇక పలు అడ్డంకులను దాటుకుని 1974 మే 7న విడుదలైన ఈ మూవీ అఖండ విజయాన్ని సాధించి, పాత రికార్డులు అన్నింటిని తిరగరాసింది. అప్పట్లోనే ఈ సినిమా రెండు కోట్ల కలెక్షన్స్ రాబట్టి, నేషనల్ అవార్డును దక్కించుకుంది. అయితే తను తీయాలనుకున్న సినిమాను కృష్ణ తీయడం ఎన్టీఆర్ కు నచ్చలేదు. అందుకే కృష్ణకు, ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. కానీ చివరకు “అల్లూరి సీతారామరాజు” సినిమాను చూసిన ఎన్టీఆర్ కృష్ణని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు సినిమాను తీయాలనే ఆలోచనను ఎన్టీఆర్ విరమించుకున్నారు. కానీ వీళ్ళ మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు మాత్రం తగ్గలేదు.

కేవలం సినిమాల పరంగానే కాదు రాజకీయంగాను ఇద్దరూ పోటీ పడ్డారు. ఒకానొక దశలో ఈ వివాదం పీక్స్ కి వెళ్లడంతో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసేదాకా కృష్ణ వెళ్లారు. సింహాసనం, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం సినిమాలను ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ తీశారు. ఇందులో కొన్ని సినిమాలలో కృష్ణ హీరోగా నటించగా, మరికొన్ని సినిమాలలో వేరేవాళ్లను నటింపజేశారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ తరచుగా వాడే ఊత పదాలను కూడా వాడారు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసిపోయారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు