Ooru Peru Bhairavakona : వాయిదా గురించి మమ్మల్ని ఎవరూ అడగలేదు… రిలీజ్ డేట్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్

సినిమా రిలీజ్ డేట్ విషయంలో “ఊరు పేరు భైరవకోన” నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ సినిమాను వాయిదా వేసుకోమని ఎవ్వరూ తమను సంప్రదించలేదని, తమ రెండేళ్ల ఈ కష్టాన్ని అనుకున్న సమయానికి థియేటర్లోకి తీసుకొస్తామని ప్రొడ్యూసర్ రాజేష్ దండా చెప్పడం టాలీవుడ్ లో చర్చకు దారి తీసింది.

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా థ్రిల్లర్ మూవీ “ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచేసాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ పడుతూ చివరకు ఫిబ్రవరి 9ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఎప్పటికప్పుడు సినిమా నుంచి కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో అతీంద్రియ శక్తుల అంశాలతో ఉత్కంఠతను రేకెత్తించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే “ఊరు పేరు భైరవకోన” మూవీ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈగల్’ టీం కానీ, దిల్ రాజు కానీ మమ్మల్ని రిలీజ్ వాయిదా వేసుకోమని అడగలేదు, సంప్రదించలేదు. సో మేము ఫిబ్రవరి 9కే వచ్చేస్తున్నాం. ఇది మా రెండున్నరేళ్ల కష్టం” అంటూ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.

ఇదంతా చూస్తుంటే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల సమస్య ఇంకా కొనసాగుతున్నట్టుగా అనిపిస్తోంది. సంక్రాంతికి ఒకేసారి ఐదుగురు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడం, ఆ తర్వాత థియేటర్ల వివాదం తెరపైకి రావడంతో అందులో కొన్ని సినిమాలు వాయిదా వేసుకుంటే బాగుంటుందని ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూచించారు. పైగా ఎవరైనా తమ సినిమాను వాయిదా వేసుకుంటే వాళ్లకు సోలో రిలీజ్ డేట్ ను ఇస్తామని ప్రకటించేశారు. దీంతో సంక్రాంతి బరిలో నిలిచిన రవితేజ “ఈగల్” టీం తమ సినిమాను వాయిదా వేసుకుని, ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. వీళ్ళ అనౌన్స్మెంట్ తో అప్పటికే ఆ తేదీపై కర్చీఫ్ వేసి కూర్చున్న “ఊరు పేరు భైరవకోన” టీంపై, “టిల్లు స్క్వేర్” సినిమాలపై పిడుగు పడింది. ఈ రెండు సినిమాలను పోస్ట్ ఫోన్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం “ఈగల్” పోటీగా వచ్చినా సరే తగ్గేదేలే అంటూ తాము అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేస్తున్నారు “ఊరు పేరు భైరవకోన” నిర్మాతలు. మరి సంక్రాంతి సినిమాల విషయంలో రోజుకో ట్విస్ట్ బయటపడినట్టు మరోసారి ఫిబ్రవరి 9 లోపు ఏమేం చూడాల్సి వస్తుందో!

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు