Shriya Saran: తనని పెళ్లి చేసుకోలేదని శ్రియని టార్చర్ పెట్టిన టాలీవుడ్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి హీరోయిన్ శ్రియా శరన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో కారణంగా ఈమె సినిమా అవకాశాలు కూడా కోల్పోయారు అనే విషయం వైరల్ గా మారుతున్నది.

ఒకానొక సమయంలో తెలుగు, తమిళ్ వంటి భాషలలో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రియ ఇప్పటికీ మూడవ తరం హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది. హీరోయిన్గా ఈ మధ్య కాస్త ఫేడ్ అవుట్ అయినా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బాగా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.. శ్రియ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమయంలో ఉన్నఫలంగా సినిమా అవకాశాలు లేకుండా పోయాయట. అయితే శ్రియకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కారణమని తెలుస్తోంది.

శ్రీయ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమెను టాలీవుడ్ హీరో వివాహం చేసుకోవాలని చాలా టార్చర్ పెట్టేవారట.. ఆ టార్చర్ భరించలేక కొద్దికాలం ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిందట శ్రియ. అయితే అప్పటికే ఆ హీరోకి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో శ్రియకు ఆ హీరోని వివాహం చేసుకోవడం ఇష్టం లేదట. దీంతో ఆ హీరోని రిజెక్ట్ చేయడంతో.. తన పలుకుబడి ఉపయోగించి తనకు వచ్చిన అవకాశాలని రానివ్వకుండా చేస్తూ ఉండేవారట.

- Advertisement -

దీంతో విసుగు చెందిన శ్రియ కాస్త గ్యాప్ ఇచ్చి మధ్యలో సినిమాలు చేసినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం శ్రియా కూడా తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా వివాహం చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనకు వివాహమైన విషయాన్ని తెలియజేసి అందరికి షాక్ ఇచ్చింది శ్రియ. ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోయి గ్లామర్ ని వలకబోస్తూ తన భర్తతో కలిసి లిప్ లాక్ లు ఇస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూనే ఉంది శ్రియ. ప్రస్తుతం హీరోయిన్ శ్రియకి సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి శ్రియని టార్చర్ పెట్టిన ఆ హీరో ఎవరో అంటూ అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు