Ram Charan: మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న రామ్ చరణ్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో.. పాత్రలలో మెప్పించిన రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎన్నో విమర్శలను, ట్రోల్స్ ను, అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది.. కానీ రామ్ చరణ్ ప్రతి సినిమాలో కూడా తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. RRR సినిమాతో రామ్ చరణ్ మరింత క్రేజ్ అందుకున్నారని చెప్పవచ్చు.

రామ్ చరణ్ నటనకు ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది.. తెలుగు, తమిళ్ , హిందీలో మంచి విజయాన్ని సాధించిన RRR సినిమాలో తన నటనకు సైతం పాప్ గోల్డెన్ అవార్డును ఈ ఏడాది అందుకున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ది ఇయర్ విజేతగా నిలవడం జరిగింది రామ్ చరణ్. ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ తన నటనతో ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు.. ఆస్కార్ విజేత గా నిలిచిన నాటు నాటు పాటకు కూడా రాంచరణ్ కు మరింత గుర్తింపు లభించింది.

షారుక్ , దీపిక , ఆదాశర్మ ఇలా ఎంతోమంది నామినేషన్లను అధిగమించి మరి రామ్ చరణ్ ఈ విజయాన్ని అందుకోవడం జరిగింది.. బాలీవుడ్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ రామ్ చరణ్ ఇలాంటి అరుదైన గౌరవం అందుకోవడంతో అటు తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు, నటీనటులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు మాత్రం కింగ్ ఈస్ కింగ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఏడాది బాలీవుడ్ గోల్డెన్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు అందుకున్నటువంటి నటీనటుల కొన్ని ఫోటోలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నది. భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి అభిమానుల అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందేమో చూడాలి మరి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు