Samantha: కొత్త జాబ్ చూసుకున్న సామ్… జడ్జ్ గా చేయడానికి జబ్బు అడ్డురాట్లేదా?

సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం అనారోగ్య కారణాలతో రెస్టు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ కొత్త జాబ్ వెతుక్కుంది. అదికూడా ఓ షోకు జడ్జిగా… మరి ఇప్పుడు ఆమెకు అనారోగ్య కారణాలు అడ్డు రావట్లేదా?

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం. విజయ్ దేవరకొండ సరసన ఖుషి ఖుషి అనే సినిమాలో నటించి తన అభిమానులను అలరించింది. సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అనంతరం ఈ బ్యూటీ కొన్ని రోజులు సినిమాలకు విరామం ఇవ్వబోతున్నాను అంటూ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో పోరాడుతున్న కారణంగానే రెస్ట్ తీసుకోవాలని అనుకుంది ఈ బ్యూటీ.

ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి పలు రకాల చికిత్సలు ట్రై చేస్తోంది. ఇక సినిమాలకైతే దూరమైంది కానీ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచేది. కానీ కొన్ని రోజుల నుంచి తన అభిమానులకు ఆ భాగ్యాన్ని కూడా కలిగించకుండా మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తుంది సమంత. అయితే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సామ్ ఫోటోలు సినీ ప్రియులను ఆశ్చర్య పరుస్తున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం తన మయోసైటిస్ రికవరీ జర్నీ లో ఉన్న సమంత ఒక రియాల్టీ షో న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తోంది. ఎమ్ టీవీలో ప్రసారం కాబోతున్న ఓ రియాలిటీ షోలో సమంత కనిపించబోతోంది. పాపులర్ బాలీవుడ్ బాద్షా మరో న్యాయ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సమంతతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలలో వీరిద్దరూ నవ్వుతూ సరదాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన కొంత మంది సినిమాలకు జబ్బు అడ్డం వచ్చింది అంటూ దూరమైంది, మరి సామ్ కు ఈ షోకు జడ్జిగా వ్యవహరించినప్పుడు అదే జబ్బు అడ్డు రాలేదా? అని సెటైర్లు వేస్తున్నారు.

కానీ సమంత అభిమానులు మాత్రం ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ వంటి షోలతో పాటు కొన్ని ఇంటర్వ్యూలను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా ఓ రియాల్టీ కోసం జడ్జిగా మారింది. సమంత త్వరలో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ ఇండియన్ విషయంలో కనిపించనుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు