Nagma: త్వరలో నగ్మా పెళ్లి.. వార్తలలో నిజమెంత..?

సీనియర్ నటి అందాల తార నగ్మా గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రధాన పాత్రలు పోషించి.. తన అందంతో.. నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ కూడా వివాహం చేసుకోలేదు. గతంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎటువంటి నిజాలు బయటపడలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఆమె ఐదు పదుల వయసులో వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు నగ్మా లేటు వయసులో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది అంటూ ఒక తమిళ సీనియర్ జర్నలిస్టు కామెంట్ చేసారు. వాస్తవానికి మరికొంతమంది తమిళ సీనియర్ జర్నలిస్టులు అనుభవశాలి అన్న అర్హతతో నటీనటులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు.

తెలుగులో కూడా ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే తన వ్యక్తిగత విషయాల గురించి చిన్న చూపు చూస్తూ మాట్లాడే వారిపై నగ్మా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ తమిళ జర్నలిస్టుకి ఆమె నేరుగా ఫోన్ చేసి మహిళలంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు..? నేను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసు పెడితే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి ? అంటూ చాలా ఘాటుగానే ప్రశ్నించింది. నగ్మా ఇంత సీరియస్ అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే..తమిళ సీనియర్ జర్నలిస్టు ఏం మాట్లాడాడు అనే విషయానికొస్తే..” ఈ జనరేషన్ చాలా తెలివైనది.. వయసు అయిపోయిన హీరోయిన్లు ఏం చేసినా ఇక వారిని ఈ జనరేషన్ పెద్దగా పట్టించుకోదు.. అందుకే నగ్మా కి ఇప్పుడు పెళ్లిపై మనసు మళ్లింది” అంటూ మాట్లాడాడు.

దీంతో కోపం తెచ్చుకున్న నగ్మా.. అతనికి ఫోన్ చేసి కడిగిపారేసింది.. ఈమె మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ నగ్మా నే అని.. గతంలో లాగా ఇప్పుడు కూడా బోల్డ్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని తాను నటిస్తే చూడడానికి ప్రేక్షకులు కూడా సిద్ధంగానే ఉంటారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు గతంలో హీరోయిన్గా తాను సాధించిన విజయాలను కూడా గుర్తు చేసింది. అంతేకాదు ఎన్నో రకాల యాడ్స్ చేయడం, సినిమాలు చేయడం, రాజకీయాలలో పాల్గొనడం ఇలా ఎన్నో రంగాలలో మహిళగా తాను సాధించిన విజయాల గురించి నగ్మా చెప్పుకొచ్చి అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. మొత్తానికైతే అతను మాట్లాడిన మాటలకు నగ్మా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయినట్లు సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు