Honey Rose: ఆ లోపం వల్లే హనీ రోజ్ కు తెలుగులో అవకాశాలు రావడం లేదా..?

టాలీవుడ్ లో గతంలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించి ఫేడ్ అవుట్ హీరోయిన్ గా మారిపోయిన వారిలో హనీ రోజ్ కూడా ఒకరు.. కానీ బాలకృష్ణతో నటించిన వీరసింహారెడ్డి సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా విడుదలైన తరువాత దాదాపుగా కొన్ని నెలల పాటు ఈమె పేరు బాగా వినిపించింది. పలు రకాల షాపింగ్ మాల్స్, ఈవెంట్స్ కు వెళ్తూ మరింత క్రేజ్ అందుకున్న హనీ రోజ్ సినిమాలలో మాత్రం పెద్దగా కనిపించలేకపోయింది.

ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఎక్కువగా అక్కడ పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. లేటు వయసులో కూడా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు.. అయినప్పటికీ హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. కానీ మేకర్స్ మాత్రం ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి మక్కువ చూపలేదని వార్తలు వినిపిస్తున్నాయి

హనీ రోజ్ కు అవకాశాలు రాకపోవడానికి గల కారణం ఏంటనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. యూత్ కలల రాకుమారిగా పేరుపొందిన ఈమె అదిరిపోయే స్ట్రక్చర్ కి అందానికి సైతం ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తదుపరి చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది మలయాళంలో మూడు సినిమాలలో నటించింది.

- Advertisement -

అందులో ఒకటి ఫుల్కాలం ఇందులో స్పెషల్ అప్పియరెన్స్ గా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళం లో వచ్చిన రాణి అనే చిత్రంలో నటించడం జరిగింది. తెలుగులో వీర సింహారెడ్డి సినిమాల్లో కనిపించింది. వచ్చే ఏడాది కూడా ఈమె తేరి మేరి, రాచల్ అనే పలు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. కానీ తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం ఆశ్చర్యం అని చెప్పవచ్చు.

తెలుగులో అవకాశాలు రాకపోవడానికి ముఖ్య కారణం ఈమె చాలా లావుగా ఉండడమే.. ఆలోపం వల్ల ఈమెకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ముందుకు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ రోల్ ఇస్తే ఈమెకు పెద్దగా సెట్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అబ్బాయిల ఆరాధ్య దేవతగా పేరుపొందిన హనీ రోజ్ మరి తెలుగులో ఏ సినిమాలో నటిస్తుందో అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు