Hanuman Movie: వీఎఫ్ఎక్స్ వర్క్స్… మళ్లీ అదే వాయిదా డౌట్?

ఈ సారి సంక్రాంతికి వచ్చే సినిమాలపై ఆడియన్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ తో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జ కాంబినేషన్ లో వస్తున్న హనుమాన్ సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. కానీ, ఈ సినిమా విషయంలో ఆడియన్స్ కు ఓ అనుమానం చాలా రోజుల నుంచి వెంటాడుతూనే ఉంది. అదే వాయిదా…

నిజానికి హనుమాన్ సినిమా షూటింగ్ పూర్తి అయి నెలలు గడుస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే, ఎప్పుడెప్పుడో వచ్చిన ఆదిపురుష్ కంటే ముందే హనుమాన్ మూవీ థియేటర్ లో విడుదల కావాల్సింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఆదిపురుష్ వచ్చేంత వరకు తమ సినిమాపై మంచి నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ఆదిపురుష్ పై వీఎఫ్ఎక్స్ పరంగా ట్రోల్స్ రావడంతో.. హనుమాన్ టీం అలర్ట్ అయింది.

కొద్ది రోజులు వాయిదా వేసుకున్న పర్లేదు.. కానీ, ఆదిపురుష్ లాంటి పరిస్థితి మాత్రం తమకు రావొద్దని అనుకున్నారు. అందుకే కావాల్సినంత టైం తీసుకుని సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో అయినా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. బాగానే ఉంది. రిలీజ్ డేట్ కి ఇంకా ఒక నెల మాత్రమే ఉంది. కానీ, ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం ఓ పోస్టర్.. ఒక సాంగ్ అయినా రిలీజ్ చేయడం లేదు.

- Advertisement -

సంక్రాంతి లాంటి టైంలో మూవీ వస్తుందంటే… నెల రోజుల కంటే ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. కానీ, హనుమాన్ టీం నుంచి అలాంటేదీ కనిపించడం లేదు. దీని వల్ల ఆడియన్స్ లో మళ్లీ డౌట్స్ వచ్చేలా చేస్తుంది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ అయిపోయాయా? లేదా? క్షమించండి.. వాయిదా వేస్తున్నామంటూ మళ్లీ ప్రకటన చేసి చేతులు దులుపుకుంటారా? అంటూ ఆడియన్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే యూఎస్ లో మూవీ రైట్స్ తీసుకున్న వాళ్లు మాత్రం… హనుమాన్ మూవీ సంక్రాంతికే వస్తుందని… ఇందులో ఎలాంటి మార్పులు లేదు అని చెబుతున్నారు. కానీ, ఇక్కడ హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు మాత్రం.. మాకు నమ్మకం లేదు దొర. ప్రశాంత్ వర్మ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు నమ్మలేం అని అంటున్నారు.

Check Filmify Telugu for the most recent upcoming movie updates and celebrity News from all Film Industries. Also get the latest tollywood updates, celebrity photos, beautiful pics of heroines & heros, latest Bollywood Gossip at Filmify.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు