Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అడగపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. మొదట ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. అంతేకాదు నటన రాదు అని.. తండ్రి ఇన్ఫ్లుయేన్స్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.

కానీ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ నేడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ నేడు ఇండస్ట్రీలోనే అత్యంత ధనిక హీరోగా కూడా మారిపోయారు. తాజాగా ఆయన నికర ఆస్తి విలువ రూ.1370 కోట్లు అని తెలుస్తోంది. వినడానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం.. వేలకోట్ల ఆస్తి రూపాయలను కలిగి ఉన్నారు రామ్ చరణ్.

కేవలం సినిమాల ద్వారానే కాకుండా తెలివిగా పెట్టుబడులు పెట్టడంతో పాటు యాడ్స్ చేయడం వల్ల ఈ స్థాయికి ఎదిగినట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా రూ.40 కోట్ల పారితోషకం అందుకున్న రాంచరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి కూడా రూ.50 కోట్ల మేర పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న సినిమా కోసం ఈ నంబర్ ఇంకాస్త మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఒకవైపు సినిమాలు, మరొకవైపు వ్యాపారాలు నిర్వహిస్తూ భారీగా సంపాదిస్తున్న రామ్ చరణ్ విమానయాన సంస్థలో కూడా పెట్టుబడులు పెట్టారు. దీనికి తోడు కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీని కూడా స్థాపించి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పలు టీవీ యాడ్స్ లో కూడా నటిస్తున్న ఈయన పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తానికైతే అటు తండ్రి సంపాదించిన ఆస్తులు కాకుండా కేవలం సొంతంగానే ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక తండ్రి ఆస్తులు కూడా కలిపితే సౌత్ ఇండియాలోనే అత్యంత ధనిక హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టిస్తారని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు