Tollywood: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ లవర్ ?

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నరసింహుడు సినిమాలో పాలకడ్ పాపగా వయ్యారాలు ఒలకించిన సమీరా రెడ్డి.. ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. జై చిరంజీవ లో శైలజ గా అలాగే అశోక్ సినిమాలో అంజలిగా ఈ బ్యూటీ అందరినీ అలరించింది. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి… ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది.
హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ… సౌత్ లోని అన్ని భాషలలో నటించడమే కాకుండా బెంగాలీ లోను నటించి అందర్నీ మెప్పించింది. ఇక చివరిగా రానా చేసిన కృష్ణం వందే జగద్గురు సినిమాలో ఓ స్పెషల్ పాటలో నటించింది ఈ బ్యూటీ.
ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి తర్వాత ఎదురైన ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయింది సమీరా రెడ్డి. పెళ్లి జరిగిన కొత్తలోనే గర్భం దాల్చడంతో నాపై చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని తెలిపింది.
2014 సంవత్సరంలో అక్షయ్ తో నాకు పెళ్లి జరిగిందని… దీన్ని మా ఇంటి టెర్రస్ మీదే జరిపారని తెలిపింది. ఏ హడావిడి లేకుండా పెళ్లి జరగడంతో దీనిని కూడా చాలామంది ట్రోల్ చేశారని వివరించింది. అలాగే నేను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవడం వల్ల… సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారని కొంతమంది ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు