NTR: అలా చేస్తే చంపేస్తా.. భార్య ప్రణతికి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..!

టాలీవుడ్ లవ్లీ కపుల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. గత 12 ఏళ్లుగా వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీళ్ళ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనకు తెలిసిందే. 2011 మే 5వ తేదీన ఎన్టీఆర్ – ప్రణతి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే కుమారులు జన్మించారు.
ఈ జంటకు 2014లో మొదట అభయ్ రామ్ జన్మించగా.. 2019లో భార్గవ్ రామ్ ని స్వాగతించారు. అయితే ఎన్టీఆర్ కి మొదటి నుండి కూతురు అంటే చాలా ఇష్టమట. మొదట కొడుకు పుట్టిన తర్వాత ఎంతో ఆశగా కూతురు పుడుతుందని అనుకున్నారట ఎన్టీఆర్. కానీ రెండవసారి కూడా కొడుకు పుట్టడంతో ఆయన కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కానీ ఎన్టీఆర్ కోసం లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డను కనడానికి కూడా సిద్ధపడిందట.
కానీ వైద్యులు మాత్రం ఆ చాన్స్ తీసుకుంటే ప్రణతి హెల్త్ కి డేంజర్ అని చెప్పారట. అయినప్పటికీ కూతురిని కనడానికి సిద్ధపడిందట ప్రణతి. ఆ సమయంలో ప్రణతి పై సీరియస్ అయ్యారట ఎన్టీఆర్. “ఇంకోసారి ఇంకో బిడ్డను కణాలని చూస్తే చంపేస్తాను.. నాకు నువ్వే ఇంపార్టెంట్ అంటూ ఎంతో ప్రేమగా ఆమెకు వార్నింగ్ ఇచ్చారట”. దీంతో తారక్ కి భార్యపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు