Shivanirajasekhar: ఉప్పెన సినిమాను అందుకే రిజెక్ట్ చేశా.. శివాని రాజశేఖర్..!!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన మొట్టమొదటి చిత్రం ఉప్పెన.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చిట్టిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కరోనా తర్వాత విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటించడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. ఈమెకు కూడా ఇదే మొదటి సినిమా కావడంతో మంచి పాపులారిటీ అందుకుంది. ఏకంగా ఈ సినిమా రూ 100 కోట్ల క్లబ్లో చేరి పలు రికార్డులను సైతం సృష్టించింది. అంతేకాకుండా 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో కూడా ఉత్తమ చిత్రంగా అవార్డును సైతం అందుకోవడం జరిగింది.

ఈ సినిమా తర్వాత కృతి శెట్టి కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఆమె కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అయితే మొదట ఈ సినిమానీ తెలుగు అమ్మాయి అయినటువంటి జీవిత రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కు వచ్చిందట. అయితే ఈమె ఎందులో ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శివాని రాజశేఖర్ హీరోయిన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఇప్పటికి ఎంతో కాలం అవుతుంది. కానీ స్టార్ డం ను మాత్రం అందుకోలేక పోతోంది. తనకంటూ కొన్ని పరిధిలు , పరిమితులు పెట్టుకున్న శివాని రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. ఉప్పెన సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం పైన స్పందించింది..మొదట ఈ సినిమాలో హీరోయిన్గా తనని అడిగారని కానీ తాను తిరస్కరించానని తెలిపింది. అందులో అంతగా మీకు నచ్చనిది ఏంది అంటూ అక్కడ ఉన్న యాంకర్ ప్రశ్నించడం జరిగింది..

- Advertisement -

శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. తనకు వినిపించిన కథ డ్రాఫ్ట్ లో కొన్ని బోల్డ్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని వాటిని తాను చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యి చేయలేనేమో అనుకోని వదిలేశానని తెలిపింది శివాని రాజశేఖర్.. అయితే ఆ తర్వాత తనకు వినిపించిన స్క్రిప్ట్ వేరని వారు తీసిన సినిమా వేరని తెలియజేశారు.

ఇప్పటికీ ఇలాంటి లిప్ లాక్ సన్నివేశాలలో నటించాలంటే తనని తాను అడగాలని శివాని రాజశేఖర్ తెలియజేసింది. లవ్ మేకింగ్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలలో తాను నటించగలుగుతానో లేదో తెలియలేదు అంటూ తెలుపుతోంది. అయితే స్క్రిప్ట్ మార్చి కృతి శెట్టిని అడగగా ఈ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా గతంలో సుకుమార్ తమన్నా ని 100% లవ్ సినిమాతో.. హెబ్బా పటేల్ ని కుమారి 21ఎఫ్ సినిమాతో తీసుకొచ్చి మంచి పాపులారిటీ చేశారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు