Tollywood: ఆ టాలెంట్ రాజ్ కుమార్ హిరానీ తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ కే సొంతమా..?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ , షాలిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమైన అర్జున్ రెడ్డి వంగ మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీని దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అలా అక్కడ కూడా అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో తెరకెక్కించి అక్కడ కూడా మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది ఈ సినిమా.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సందీప్ రెడ్డి వంగా కి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనలో దాగి ఉన్న మరొక టాలెంట్ కూడా తాజాగా తెరపైకి వచ్చింది. సాధారణంగా ఏదైనా ఒక వీడియోని మనం ప్రజెంట్ చేయాలి అంటే అందులో ఎడిటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా సినిమా కూడా అంతే డైరెక్షన్ విభాగంలో సినిమాను ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేసినా సరే ఎడిటింగ్ సరిగ్గా లేకపోతే ఆ సినిమా డిజాస్టర్ అవుతుంది. అందుకే సినిమాకు డైరెక్టర్ ఎంత ప్రాణం పోస్తారో ఎడిటర్ కూడా అంతే ప్రాణం పోస్తారని చెప్పాలి. సాధారణంగా ఒక రచయితకి మాత్రమే ఐడియా ఉంటుంది తాను రాసుకున్న కథను ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది.. మరి మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా డైరెక్టర్ ఆలోచనలను నమ్మి కష్టపడతారు.

అలాగే డైరెక్టర్.. డైరెక్ట్ చేసిన కథకి ఎడిటింగ్ అనేది ప్రాణం పోస్తుంది. అయితే ఒక సినిమాను డైరెక్ట్ చేసి ఎడిటింగ్ చేయడం అనేది అద్భుతమైన కల. ఇలాంటి అద్భుతమైన స్కిల్స్ ఉన్నది బాలీవుడ్ లో ఒక రాజకుమారి హిరానీ కి మాత్రమే. ఇక ఆయన తర్వాత అలాంటి టాలెంట్ ఉన్నది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కే అని చెప్పవచ్చు..

- Advertisement -

అందుకే ఇదే విషయంపై తాజాగా సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. నేను కథను డైరెక్ట్ చేయడం మాత్రమే కాదు ఎడిటింగ్ కూడా చేస్తా.. ఎడిటింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. నిజానికి అది చాలా కష్టమైన పని. అయితే నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్ధం కాదనేది నా భావన. అయితే ఇంకా బెటర్ గా చేసే వాళ్ళు వుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అలా అయితే నాకు చాలా సమయం కూడా కలిసొస్తుంది. అంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే సందీప్ రెడ్డి వంగాలో టాలెంట్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు