Telugu Director: హిట్ కొట్టాకా.. భలే మంచి రోజు వచ్చాకా పార్టీ ఉండాలి… ఇప్పుడు అంటే ఎలా డైరెక్టర్?

సినిమా షూటింగ్ అన్నప్పుడు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి, లేదా హీరోతో వివాదాలు రావడం సాధారణమే. అయితే చిన్న చిన్న విషయాలే ఆ వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. డైరెక్టర్ కరెక్ట్ గా సెట్ కి రాకపోవడం వలన, లేదంటే హీరో హీరోయిన్లు షెడ్యూల్ ప్రకారం సెట్లో ఉండకపోవడం వంటి కారణాలు కూడా ఆ వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. టాలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోలు మాత్రం ఎంతో డిసిప్లిన్ గా టైం ఫాలో అవుతూ ఉంటారు. అలాగే డైరెక్టర్స్ కూడా. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం టైం ఫాలో అవ్వకుండా హీరోల సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. దానికి తగిన ఫలితం అనుభవిస్తూ ఉంటారు. తాజాగా ఓ డైరెక్టర్ విషయంలో ఇదే జరిగింది.

ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఓ తెలుగు సినిమా సెట్ ఆ వివాదానికి వేదిక అయింది. షూటింగ్ పూర్తయ్యాక ఫలానా మూవీ డైరెక్టర్ పార్టీ చేసుకున్నారట. అందులో భాగంగా తప్ప తాగి, ఒళ్ళు తెలియకుండా హాయిగా పడుకుండిపోయాడట. పొద్దెకుతున్నా ఆ మత్తులో గుర్రు పెట్టి నిద్రపోయాడట. ఆ మరుసటి రోజు ఉదయాన్నే షూటింగ్ ఉండడంతో హీరో టైంకి లొకేషన్ కి చేరుకుని డైరెక్టర్ కోసం చాలా సేపు వెయిట్ చేశాడట. ఇక వెయిట్ చేసి చేసి డైరెక్టర్ రాకపోవడంతో విసిగి వేసారి పోయిన హీరో ఆ రోజు షూట్ క్యాన్సిల్ అని సీరియస్ గా వెళ్ళిపోతుండగా, సెట్ లో ఉన్న టీం మొత్తం ఆయనను బతిమిలాడి తిరిగి వచ్చేలా చేశారట.

ఇక ఎప్పటికో మత్తు వదిలించుకున్న డైరెక్టర్ తీరా ఫ్రెష్ అయ్యి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేశాడట. దీంతో మొత్తానికి ఈ విషయం కాస్తా ఆ సినిమాను నిర్మిస్తున్న బడా ప్రొడక్షన్ హౌజ్ కు చేరింది. హైదరాబాదులో ఉన్న ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చారట. అయితే డైరెక్టర్ తీసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి హిట్ సినిమాలు కావడంతో వార్నింగ్ తో వదిలేసారట.

- Advertisement -

లేదంటే ఆ బడా ప్రొడక్షన్ హౌస్ ఇలా డిసిప్లిన్ లేకుండా ప్రవర్తించిన ఈ డైరెక్టర్ ని పక్కనపెట్టి మరో డైరెక్టర్ ని తీసుకునేది అని టాక్. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒళ్ళు తెలియకుండా తాగడం దేనికి? ఒకవేళ తాగినా లిమిట్లో ఉండాలి గాని హీరోలకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం ఎందుకు? బుద్ధిగా పని చేసుకోకుండా ఇలా తింగర వేషాలు వేసి, నిర్మాతలతో తిట్లు తినడం ఎందుకయ్యా డైరెక్టర్ అంటూ సదరు డైరెక్టర్ పై సెటైర్లు వేసుకుంటున్నారు ఫిలింనగర్లో.

ఈ విషయం గనక బయటకు వచ్చింది అంటే ఆ డైరెక్టర్ కెరీర్ నాశనమే ఇక. ఇలా పిలిచి అవకాశం ఇస్తే, సరిగ్గా పని చేసుకోకుండా తాగుబోతు వేషాలేసి నిర్మాతలకు నష్టం కలిగించే డైరెక్టర్లను ఏ నిర్మాతలు భరిస్తారు? హీరో కాస్త సహనంగా వ్యవహరించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆ నష్టాన్ని భరించేది ఎవరు? మరి ఇప్పటికైనా ఈ డైరెక్టర్ జాగ్రత్తగా సినిమాను పూర్తి చేస్తాడేమో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు