Kota Bommali PS : అరగంట మూవీని కట్ చేశారా? అందుకే బొమ్మ హిట్టా?

పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ “కోటబొమ్మాళి పీఎస్” మూవీ ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచింది. యంగ్ హీరో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా, సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించిన “కోటబొమ్మాళి పీఎస్” మూవీ “నాయట్టు” అనే మలయాళ హిట్ మూవీకి రీమేక్ గా వచ్చింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతలు బన్నీవాస్, విద్య కొప్పినీడు నిర్మించారు. ప్రస్తుతం సినిమా పాజిటివ్ మౌత్ కాక్ తో దూసుకెళ్తోంది. అయితే సినిమా హిట్ కావడానికి మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయమే కారణం అనే టాక్ ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది

ప్రస్తుతం ఈ మూవీ రన్ టైం 2 గంటల 25 నిమిషాలు. అయితే నిజానికి సినిమా నిడివి 3 గంటలు ఉందట. కానీ సినిమా రన్ టైం మరీ ఎక్కువగా ఉండడంతో, ప్రేక్షకులకు బోర్ కొడుతుందేమోనన్న ఉద్దేశంతో 30 నిమిషాల మూవీని కట్ చేశారట. ఆ 30 నిమిషాలు కూడా ఒకే సీన్ కావడం ఆశ్చర్యపరిచే విషయం. వరలక్ష్మి శరత్ కుమార్, కమెడియన్ ప్రవీణ్ మధ్య జరిగే కామెడీకి సంబంధించిన అరగంట సన్నివేశాలను కట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బన్నీ వాస్ వెల్లడించారు.

“కోటబొమ్మాళి పీఎస్” మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే కట్ చేసిన ఆ అరగంట సన్నివేశాలను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించాడు. సినిమా విజయవంతగా ఆడుతున్న ఈ టైంలో బన్నీ వాస్ చెప్పిన ఆ ఆసక్తికర అంశం వైరల్ అవుతోంది. ఇప్పటికే సినిమాను థియేటర్లలో వీక్షించిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ సన్నివేశాలను కూడా చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా డైరెక్టర్ తేజ మార్ని స్క్రీన్ ప్లే అదిరిపోయిందని, ఒరిజినల్ మూవీ “నాయట్టు” కంటే “కోటబొమ్మాళి పీఎస్” మూవీ బాగుందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని టాక్ నడుస్తోంది. మొత్తానికి “కోట బొమ్మాళి పీఎస్” టీం ఈ ఫ్రైడే హిట్ అందుకున్నారు. మేకర్స్ తీసుకున్న ఆ తెలివైన డెసిషన్ వల్లే బొమ్మ హిట్ అన్నమాట. నవంబర్ 24న రిలీజ్ అయిన “కోటబొమ్మాళి పీఎస్” మూవీ పాజిటివ్ మౌత్ టాక్ తో మంచి కలెక్షన్లు రాబడుతోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు