Mahesh Babu: అతడు తర్వాత మహేష్ ను త్రివిక్రమ్ అలా చూపిస్తాడా..?

టాలీవుడ్ లో మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం గుంటూరు కారం.. దాదాపుగా ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో కొన్నేళ్ల తర్వాత తెరకెక్కించడం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందంతో పాటు నిర్మాత నాగవంశీ చాలా ధీమాతో ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు , పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా మహేష్ , త్రివిక్రమ్ కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో మహేష్ ని.. స్టూయిక్ గా చూపించడం జరిగింది.. ఆ తర్వాత ఇతర దర్శకులు కూడా ఇలాంటి లుక్ ని అనుసరించడం జరిగింది . మళ్లీ కొద్ది సంవత్సరాల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా థియేటర్లో ప్లాప్ అయినా ఇప్పటికీ బుల్లితెర పై టాప్ పొజిషన్ లో ఉన్నదని చెప్పవచ్చు.

అయితే ఖలేజా సినిమాలో మహేష్ బాబు హైపర్ యాక్టివ్ గా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇతర సినిమాలలో కూడా ఇదే విధానాన్ని చాలామంది దర్శకులు సైతం చూపించడం జరిగింది. ఇప్పుడు మళ్లీ తాజాగా మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో మహేష్ లో ఒక సరికొత్త కోణాన్ని సైతం బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో మాస్ హీరోగా మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా స్టోరీ తో పాటు మహేష్ పాత్ర ఉంటుందని నిర్మాత నాగ వంశీ తెలియజేస్తూనే ఉన్నారు. మొత్తానికి మహేష్ బాబు ను క్లాస్ నుంచీ మాస్ లుక్ లో చూపించబోతున్నారు త్రివిక్రమ్..

- Advertisement -

ఇటీవల విడుదలైన పలు రకాల గ్లింప్స్, పోస్టర్లు సైతం మహేష్ ను సరికొత్త స్టైల్ లో చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సరికొత్త పాత్రతో సరికొత్త ట్రెండుకి మహేష్ , త్రివిక్రమ్ శ్రీకారం చుడతారేమో చూడాలి మరి. అభిమానులు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం సినిమా విడుదల సమయానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా నిర్మాత నాగ వంశీ అప్పుడే మొదలు పెట్టేశారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు