Harish Shankar : ఈ డైరెక్టర్ అందులో వీకా? అందుకే రీమేక్స్ తో నెట్టుకొస్తున్నాడా?

టాలీవుడ్ లో రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన సొంతంగా తీసిన సినిమాల కంటే రీమేక్ లకే ప్రజలు ఎక్కువ ఓట్లు వేశారు. అలా హిట్ అయ్యిందే “గబ్బర్ సింగ్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “గబ్బర్ సింగ్” మూవీని బాలీవుడ్ మూవీ “దబాంగ్”కి తెరకెక్కించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ మూవీ పవన్ కళ్యాణ్ లోని అతిపెద్ద హిట్. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో గద్దల కొండ గణేష్ “జిగర్ తండా” అనే కోలీవుడ్ మూవీకి రీమేక్ గా వచ్చింది. ఆ మూవీ కూడా పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం హరీష్ శంకర్ చేతిలో ఉన్న రెండు సినిమాలు కూడా రీమేక్ లే.

పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమాను చాలా కాలం క్రితమే ప్రకటించాడు హరీష్ శంకర్. ఆ మూవీ “తేరి” అనే తమిళ సినిమాకు రీమేక్ గా రాబోతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా హోల్డ్ లో పడింది. అందుకే పవన్ సినిమాల్లోకి రియల్ ఇచ్చేలోపు టైం వేస్ట్ చేయకున్నా హరీష్ శంకర్ తన నెక్స్ట్ మూవీ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రవితేజతో కొత్త మూవీని ప్రకటించాడు. అయితే ఆ మూవీ కూడా “రైడ్” అనే హిందీ మూవీకి రీమేక్ అనే టాక్ నడుస్తోంది. దీంతో హరీష్ శంకర్ కేవలం రీమేక్స్ మాత్రమే తెరకెక్కించగలడు అనే టాక్ మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.

గతంలోనూ హరీష్ శంకర్ తో “గబ్బర్ సింగ్” మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ కూడా హరీష్ శంకర్ రీమేక్ లు మాత్రమే చేయగలడు అంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అంతేకాకుండా “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీని ప్రకటించినప్పుడు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ ను ట్రోల్ చేశారు. అయితే హరీష్ శంకర్ మూవీస్ లిస్టు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది ఎవరికైనా. ఈయన గతంలో రవితేజ హీరోగా ‘షాక్’ అనే మూవీ చేశాడు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లోనే ‘మిరపకాయ్’ అనే మూవీ వచ్చింది. అది పరవాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య డిజాస్టర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం సినిమాలు పర్వాలేదు అనిపించాయి. ఈ లెక్కలన్నీ చూసుకుని హరీష్ శంకర్ కి కథలు కొత్తగా రాయడం చేతకాదని, అందుకే రీమేక్స్ తో నెట్టుకొస్తున్నాడని అంటున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు