Ustaad Bhagat Singh: ఈ మాత్రం దానికి రీమేక్ రైట్స్ కొనడమెందుకు భయ్యా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి 2006 లో రవితేజ తో షాక్ సినిమా తీసి అందరికి షాకిచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని అదే హీరోతో మిరపకాయ్ తీసి మాంచి హిట్టు కొట్టాడు. కమర్షియల్ పాళ్ళు ఎక్కువ కలిగిన డైరెక్టర్ అవడంతో పవర్ స్టార్ తో సినిమా చేసే ఆఫర్ కొట్టాడు. అలా పవన్ కళ్యాణ్ తో 2012లో తీసిన “గబ్బర్ సింగ్” ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా హరీష్ శంకర్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది. ఆ తర్వాత డీజే, గద్దల కొండ గణేష్ వంటి కమర్షియల్ మూవీస్ తో మెప్పించాడు.

హరీష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” తీస్తున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాబినేషన్ లో మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లిమ్ప్స్ సాలిడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా గురించి ఒక టాపిక్ మాత్రం వైరల్ అవుతుంది. ఈ సినిమా తమిళం లో వచ్చిన “తేరి”కి రీమేక్ గా తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. దానికి హరీష్ శంకర్ తన రిప్లై గా ఆ మూవీకి పూర్తి రీమేక్ తన సినిమా కాదని, ఆ సినిమా మూలకథ లోని కొన్ని అంశాల్ని మాత్రమే తీసుకుని తెలుగులో మార్పులు చేశానని చెప్పాడు.

అయితే హరీష్ శంకర్ గత సినిమాలను గమనిస్తే ఏ సినిమాను రీమేక్ చేసినా దాని ఒరిజినల్ కు సంబంధం లేకుండా చాలా మార్పులు,చేర్పులు చేసి తీస్తాడు. ఒరిజినల్ స్టోరీకి 20 లేదా 30% మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మలుస్తాడు. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం దబాంగ్ రీమేక్ అయినప్పటికీ ఆ ఫీల్ ఎప్పుడూ రాదు. ఆ తర్వాత చేసిన రీమేక్ “గద్దల కొండ గణేష్” కూడా రీమేక్ అని అస్సలు అనిపించదు. తమిళ “జిగర్తాండ” కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హైలెట్ అయ్యాడు. కానీ తమిళంలో ఇదే పాత్ర చేసిన బాబీ సింహ కాకుండా సిద్ధార్థ్ హీరో అవుతాడు. జిగర్తాండ మాతృక నుండి 20శాతం మాత్రేమే తీసుకుని గద్దల కొండ గణేష్ తీసాడు హరీష్.

- Advertisement -

ఇప్పుడు పవన్ తో తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా తేరి రీమేక్ గా తెరకెక్కిస్తున్న హరీష్ శంకర్ ఎప్పట్లాగే తనదైన శైలిలో తీస్తున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ మాత్రం దానికి రీమేక్ రైట్స్ తీసుకోవాలా? స్ట్రైట్ సినిమాగా తీస్తే పవన్ కళ్యాణ్ కి కూడా రీమేక్ స్టార్ అన్న ట్యాగ్ పోతుంది కదా అని ఫ్యాన్స్ అంటున్నారు. అటు రీమేక్ రైట్స్ తీసుకోకుండా, ఆ సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని మాత్రమే తీస్తే ప్రొడ్యూసర్లకు డబ్బులు కూడా మిగులుతాయి అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు