Koratala Shiva : ఎన్టీఆర్30 మూడవ షెడ్యూల్ ఎప్పటి నుంచే అంటే .. ?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ కంప్లిట్ అయిన సంగతి తెల్సిందే. ఈ సినిమాకి సంబంధించి మూడవ షెడ్యూల్ కూడా తొందరలోనే స్టార్ అవబోతుంది. బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాలో, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసిన కొరటాల, రెండవ షెడ్యూల్ లో జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ కి మధ్య సీన్స్ ని తెరకెక్కించారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకి సిద్దమవుతుంది. ఆచార్య సినిమా లాంటి డిజాస్టర్ తరువాత కొరటాల ఈ సినిమా చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ 30 కి సంబందించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. RRR సినిమాతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ పాపులర్ అవడంతో ఏ విషయంలోను కంప్రమైజ్ అవకుండా భారీ స్కెల్ లో సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఐతే రాలేదు. ఇక ఎన్టీఆర్ 30 విషయానికొస్తే వచ్చే వారం ఈ సినిమాకి సంబంధించి మూడవ షెడ్యూల్ మొదలవబోతుంది. శంషాబాద్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ మొత్తం జరగనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొనబోతున్నారు. 10రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు దగ్గరికి వస్తున్నడటంతో సినిమా టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు