Gopichand Malineni : రవితేజకు ముఖం చాటేసి, సీనియర్ హీరోల వేటలో డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని నెక్స్ట్ మూవీపైనే అందరి దృష్టి ఉంది. నిజానికి ఈ డైరెక్టర్ మాస్ మహారాజా రవితేజతో ఇప్పటికే ఓ మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డాన్ శీను, బలుపు, క్రాక్ హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుండడంతో ప్రాజెక్ట్ పై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే అనుకోకుండా ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ఇటీవల కాలంలో రవితేజకు వరుస డిజాస్టర్లు ఎదురవుతుండడంతో ఈ సినిమాను నిర్మించాల్సిన మైత్రి మూవీ మేకర్స్ పునరాలోచనలో పడింది. అంచనా ప్రకారం ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ మార్క్ దాటుతుండడంతో రవితేజ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఆ సినిమాను చేయడం కష్టమని భావించి ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టారు.

బడ్జెట్లో కోతలు పెట్టి రవితేజతోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారేమో అని అనుకుంటుండగా, అందరికీ షాక్ ఇస్తూ రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో మూవీ అనే విషయం తెర మీదకు వచ్చింది. ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారో లేదో రవితేజ తన నెక్స్ట్ మూవీని మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవితో చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. దీంతో గోపీచంద్ తో రవితేజ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా పట్టాలెక్కాల్సిన సినిమా లేనట్టేనని తెలుస్తోంది. మరో హీరోను ఈ సినిమా కోసం తీసుకునే పనిలో ఉన్నాడట డైరెక్టర్.

ఇటీవల నిర్మాత నవీన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లి వచ్చిన గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీ కోసం సీనియర్ హీరోల వేటలో పడ్డాడట. సీనియర్ హీరోతో చేయాల్సిన కథ ఇదని, యంగ్ హీరోలు ఈ ప్రాజెక్టుకు సూట్ అవ్వరని సమాచారం. అందుకే ఈ సినిమా కోసం కోలీవుడ్ లేదా బాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకునే పనిలో ఉన్నాడట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇక హీరో ఫిక్స్ అయితే ఈ మూవీ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లొచ్చు అని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా 1990లలో అగ్రవర్ణాలు, నిమ్న కులాల మధ్య జరిగిన కుల తగాదాల చుట్టూ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ తిరుగుతుందని వార్త ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక సినిమా బడ్జెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోతో ఈ మూవీని తీసి, తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోవాలని అనుకుంటున్నాడు గోపీచంద్. మొత్తానికి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రవితేజకు ముఖం చాటేసి మరో సీనియర్ హీరో వేటలో పడ్డాడు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు