RT4GM: ‘గోపి’ ప్లాన్ కి ‘రవన్న’ ఓకే.. మరి మిగతా వాళ్ళు?

మాస్ మహారాజ్ రవితేజ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కాంబో లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు కాగా, ఇప్పుడు నాలుగో సారి సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఎప్పుడైతే ఈ కాంబో లో మూవీ అనౌన్స్ మెంట్ అయిందో మూవీ లవర్స్ తో పాటు, ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో లాంచ్ అవగా, రవితేజ గోపీచంద్ కాంబో లో వస్తున్న ఈ నాలుగవ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండగా, భారీ క్యాస్టింగ్ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది.

అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని గోపీచంద్ కేవలం ఆరు నెలల్లో షూట్ చేసి 2024 సమ్మర్ కల్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. అంతే కాదు దీనికి రవితేజ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాకి మెయిన్ లీడ్ రవితేజ షూటింగ్ డేట్లు ఎంత అడ్జస్ట్ చేసినా కూడా, సినిమా హీరోయిన్ ఇతర నటీనటులు కూడా అనుకున్న ప్రకారం డేట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరి ఆరు నెలల్లో సినిమా పూర్తి కావాలంటే అందరూ సహకరిస్తేనే ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక యాక్టర్సే కాదు, మేకింగ్ టెక్నిషియన్స్ కూడా డేట్లు అడ్జస్ట్ చేయాలి. మరి చూడాలి ఏం జరుగుద్దో?

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు