Aadi Keshav: ‘శ్రీలీల’ ముందు తేలిపోయిన వైష్ణవ్?

టాలీవుడ్ లో డాన్స్ బాగా చేసే హీరోలు కోకొల్లలుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల మొదలుకొని చిన్న హీరోల దాకా, యాక్టింగ్ విషయం ఎలా ఉన్నా డాన్సుల విషయంలో ఇరగదీస్తారు. అయితే డాన్స్ బాగా చేసే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. మొన్నటి వరకు తమన్నా, శృతి హాసన్, ఇప్పుడు సాయి పల్లవి. అయితే ఈ లిస్ట్ లోకి వన్ ఇయర్ కిందట జాయిన్ అయిన భామ శ్రీ లీల.

శ్రీ లీల డాన్స్ ఏ రేంజ్ లో చేయగలదో తన ఫస్ట్ సినిమాతోనే నిరూపించింది. క్లాస్ అయినా, మాస్ అయినా, స్టార్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా చేయగల దిట్ట. అయితే లేటెస్ట్ గా శ్రీ లీల డాన్స్ మాస్ క్రేజ్ వల్ల ఓ ఓ హీరోకి ఇబ్బందిగా మారింది. శ్రీ లీల అతని పక్కన డాన్స్ చేస్తుంటే ఆ హీరోని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.

అతనెవరో కాదు వైష్ణవ్ తేజ్. నిజానికి వైష్ణవ్ తేజ్ కూడా వాళ్ళ అన్న సాయి ధరమ్ లాగా డాన్స్ చేయగలడు. కానీ అనుకున్న గుర్తింపు ఇంకా రాలేదు. అయితే లేటెస్ట్ గా ఈ హీరో నటిస్తున్న ఆది కేశవ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ‘లీలమ్మో’ అంటూ ఓ సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ లో శ్రీ లీల తన మాస్ డాన్స్ తో కుమ్మేసింది. అయితే పక్కనే వైష్ణవ తేజ్ కూడా తన బాగా డాన్స్ చేస్తున్నా కూడా, సోషల్ మీడియా లో శ్రీ లీల డాన్స్ నే అందరూ మెచ్చుకున్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. శ్రీ లీల ముందు వైష్ణవ్ తేలిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది ఈ మెగా హీరోకి ఇబ్బంది పెడుతున్నా, శ్రీ లీల క్రేజ్ కి ఇది నిదర్శనమని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు