ShankarDada MBBS: రీ రిలీజ్ లో ఆ సాంగ్ పెడితే… అంతకు మించిన ప్రమోషన్ అక్కర్లేదు!

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా, సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు పెద్దగా రీ రిలీజ్ కాలేదు. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ థియేటర్లలో వచ్చినా, అవి అప్పటికప్పుడు కొన్ని థియేటర్లలో వేయించినవిగాని అఫిషియల్ గా ఏ సినిమా రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు చిరు బ్లాక్ బస్టర్ మూవీ “శంకర్ దాదా MBBS” ని నవంబర్ 4 థియేటర్లలో భారీగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది.

అయితే ఈ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్లు మాత్రం ఏమి చేయడం లేదు. మూవీ క్యాస్టింగ్ గాని, మేకర్స్ గాని ఏ హడావిడి చేయలేదు. అయితే రిలీజ్ డేట్ టైం వరకు ప్రమోషన్ చేయొచ్చు.

- Advertisement -

అసలు విషయానికి వస్తే శంకర్ దాదా సినిమాలో “సందె పొద్దెక్కుతాందే” అంటూ సాగే ఒక సూపర్ మాస్ సాంగ్ ఉంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం థియేటర్లలో రాలేదు. శంకర్ దాదా 50డేస్ అయిన తరువాత థియేటర్లలో యాడ్ చేసారు. అప్పట్లో దుమ్ములేపిన ఆ పాట సినిమా లాంగ్ రన్ ఆడదానికి కూడా హెల్ప్ అయింది. దేవి శ్రీ మ్యూజిక్ కి, చిరు మాస్ బీట్స్ సాలిడ్ గా ఉంటాయి ఆ పాటలో. అయితే ఆ తర్వాత మాత్రం టీవీల్లో శంకర్ దాదా వేసినా, అందులో పాట యాడ్ చేయలేదు. అంతే కాదు యూట్యూబ్ లో కూడా వీడియో సాంగ్ అందుబాటులో లేదు.

కాబట్టి శంకర్ దాదా MBBS రీ రిలీజ్ సందర్బంగా, సినిమాలో ఆ పాట ని యాడ్ చేస్తే, సినిమా ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సినిమాలో ఆ పాట యాడ్ చేస్తారో లేదో తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు