Biggboss season7: ఈ వంక తో హౌస్ మొత్తం అర్జున్ ని టార్గెట్ చేస్తారా?

బిగ్ బాస్ సీజన్ 7 వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ నుండి ఊపందుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో అంబటి అర్జున్ ఒక్కడే సూపర్ గా రాణిస్తుండగా, మిగతా వాళ్ళు ఎలిమినేషన్ కావడానికి నామినేట్ చేయడానికే ఉన్నారనిపిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే అంబటి అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన ఆట తీరుతో మెప్పిస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా నామినేషన్ టైం లో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతూ ఇంటెలిజెంట్ అనిపించుకుంటున్నాడు. అంతే కాదు ఎంట్రీ ఇచ్చిన రెండు వారాలకే కెప్టెన్ అయ్యి ఆశ్చర్యపరిచాడు.

అయితే తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో, ఆటలో భాగంగా అనుకోకుండా అశ్విని ని అర్జున్ తోసేసాడు. ఆ విషయంపై హౌస్ మేట్స్ అందరూ సీరియస్ గా చర్చించుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఈసారి అర్జున్ ని హౌస్ మేట్స్ అందరూ ఈ ఇష్యూ ని అడ్డంగా పెట్టుకుని టార్గెట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఆల్రెడీ పూర్తయిపోగా, నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఈ విషయం గురించి ప్రస్తావించవచ్చు. ముఖ్యంగా సందీప్ చాలా ఫోకస్ చేస్తాడని అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుద్దో?

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు