Tollywood: ఒక్క నిమిషానికి శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించి సాలిడ్ హీట్ ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి, రామ్ పోతినేనితో స్కంద సినిమాలతో మరో రెండు హిట్ లని తన ఖాతాలో వేసుకుంది.

ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం ఎనిమిది సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ సరసన సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. ఈ విధంగా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశం కొట్టేయడంతో శ్రీలీల తన పారితోషికాన్ని భారీగా పెంచేసింది. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమా పెళ్లి సందడి కి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకొని.. ధమాకా సినిమాకి ఏకంగా 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. ఇక రామ్ తో స్కంద సినిమాకి కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇవే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, వాణిజ్య ప్రకటనలకు భారీగానే ఛార్జ్ చేస్తోందట. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి కోటి రూపాయలు తీసుకోవడమే కాకుండా ఫ్లైట్ టికెట్స్, ఇతర ఖర్చులు సైతం షాప్ ఓనరే భరించాలట. అది కూడా నిమిషానికి పది లక్షల చొప్పున లెక్క కట్టి కేవలం పదినిమిషాలకు ఎక్కువ సేపు ఉండదట. ఇంతకంటే సమయం దాటితే దానికి కూడా ఛార్జ్ వేస్తుందట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంత రెమ్యూనరేషన్ ఏ హీరోయిన్ కి ఇవ్వడం లేదట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు