UnStoppable: తనకు తానే సాటి అని మళ్ళీ నిరూపించిన బాలయ్య..!

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి నట వారసుడిగా రెండో తరం టాప్ హీరోలలో ఒకడిగా నాలుగు దశాబ్దాలుగా అభిమానులని అలరిస్తున్న ఈయన ప్రస్తుతం అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో, ఇంకా పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆల్ రౌండర్ గా నిలుస్తున్నారు. అయితే బాలకృష్ణ ఒక ఆల్ రౌండర్ నటుడిగానే కాక, అద్భుతంగా డైలాగ్ డెలివరీ చేసే హీరోల్లో ఒకరు.

ఆఫ్ స్క్రీన్ పై కొంచెం తడబడినా, కెమెరా ఆన్ అయిందంటే చాలు బాలయ్య డైలాగ్స్ కి విజిల్స్ పడాల్సిందే. ముఖ్యంగా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన సినిమా డైలాగ్స్ ని అవలీల గా చెప్పే బాలయ్య, హిందీలో కూడా తన డైలాగ్స్ తో అదరగొట్టాడు.

లేటెస్ట్ గా అనిమల్ ప్రమోషన్ కోసం సందీప్ వంగ, రష్మిక మందన్న తో పాటు అన్ స్టాప్పబుల్ షో కి వచ్చిన రణబీర్ కపూర్ తో, వాళ్ళ ముత్తాత పృత్వి రాజ్ కపూర్ నటించిన “మొఘల్ ఏ అజామ్” సినిమా గురించి ప్రస్తావించిన బాలకృష్ణ ఆ సినిమా లో అక్బర్ డైలాగ్స్ ని సింగల్ టేక్ లో చెప్పి రణబీర్ కపూర్ ఆశ్చర్యపోయేలా చేసాడు. అది కూడా సింగల్ టేక్ లో బాలకృష్ణ హిందీలో డైలాగ్ చెప్పే సరికి అక్కడున్న ప్రేక్షకులంతా విజిల్స్ వేశారు.

- Advertisement -

అయితే బాలయ్య చాలా రోజుల తర్వాత సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పడం చూసామని చెప్పొచ్చు. ఎందుకంటే శాతకర్ణి తరువాత బాలయ్య తన హెల్త్ ఇష్యూస్ వల్ల లెంగ్తీ డైలాగ్స్ ని సినిమాల్లో ఎక్కువగా పెట్టలేదు. అక్కడక్కడా ఒకటి అరా అఖండ లాంటి సినిమాల్లోనే చూసాం. ఇక ఈ అన్ స్టాప్పబుల్ షో లో సందీప్ తో రష్మిక మందన్న రెండోసారి రావడం విశేషం. ఇక ఈ షో లోనే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ లవ్ సీక్రెట్స్ బయట పెట్టిన సంగతి తెలిసిందే.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు