Nadiya : నాగార్జున ఆ పాడు అలవాటు… షాకింగ్ నిజాలు రివీల్ చేసిన సీనియర్ హీరోయిన్

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ కంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సీనియర్ హీరో నాగార్జునకు ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెండి తెర మీదే కాదు బుల్లితెర మీద కూడా తన ట్యాలెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నాగార్జునతో నటించే ఛాన్స్ ను ఓ సీనియర్ హీరోయిన్ వదులుకుందట. దానికి కారణం నాగార్జున కు ఉన్న ఆ పాడు అలవాటేనని ఆ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మరోసారి ట్రెండ్ అవుతోంది. ఓ తమిళ సీనియర్ నటి నందమూరి బాలకృష్ణ నన్ను రూమ్ కు పిలిచాడు అంటూ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నాగార్జునకు సంబంధించిన గతం తాలూకూ ఈ ఆసక్తికర విషయం కూడా ఇప్ప్పుడు గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.

అయితే ఆ అలవాటు రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లోనట. సీనియర్ నటి నదియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన నదియా ‘అత్తారింటికి దారేది’లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తగా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి మరోసారి టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసింది. అయితే నాగార్జున హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్నినాయన” సినిమాలో ముందుగా నదియాను తీసుకోవాలనుకున్నారట. ఈ మేరకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నదియాను సంప్రదించాడట. ఈ సినిమాలో నాగార్జున తరచూ హీరోయిన్ నడుము గిల్లుతూ ఉండడం మనం ఆల్రెడీ చూసాం.

- Advertisement -

అలా మాటిమాటికీ నడుము గిల్లించుకోవడం ఇష్టం లేదని నదియా ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో ఆ రోల్ కాస్త రొమాంటిక్ గా ఉంటుంది. అయితే అప్పటికి నదియాకు పవర్ ఫుల్ యాక్టర్ గా మరో రకమైన ఇమేజ్ వచ్చేసింది. అందుకే ఇలాంటి రోల్స్ ఓకే చేస్తే మళ్ళీ రొటీన్ రోల్స్ చేయాల్సి వస్తుందని బావించిందేమో బహుశా ఈ సీనియర్ హీరోయిన్.

అలా నదియా సైడ్ అవడంతో రమ్యకృష్ణను ఆ అవకాశం వరించింది. అప్పట్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “సోగ్గాడే చిన్నినాయన” మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నదియాకు మాత్రం రీసెంట్ టైంలో అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ రానేలేదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు