Boycott Animal Movie: తెరపైకి కొత్త వివాదం… డైరెక్టర్ పై హిందువుల ఆగ్రహం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి దృష్టి “యానిమల్” మూవీ పైనే ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ వైలెంట్ మూవీ “యానిమల్”. ఈ చిత్రం డిసెంబర్ 1న భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండగా, తాజాగా ఈ సినిమాపై కొత్త వివాదం చెలరేగుతుంది.

ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ‘యానిమల్’ ట్రైలర్ పలు వివాదాలను రేకెత్తించింది. ఒక వర్గం ప్రేక్షకులు ఈ మోస్ట్ వైలెన్స్ మూవీని ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అని ఆతృతగా ఎదురు చూస్తుంటే, మరో వర్గం వారు మాత్రం సినిమాలో మేల్ టాక్సిసిటీ, అతిగా హింసించడం, అతిగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ యూత్ ను చెడగొట్టేలా ఉందంటూ మండిపడుతున్నారు. ఇక తాజాగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన “యానిమల్” టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ లో హిందువులు ఎంతో భక్తితో పూజించే ‘స్వస్తిక్’ చిహ్నాన్ని వాడడంపై మండిపడుతున్నారు. ఈ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి సందీప్ ఈ సినిమాతో ఓ వర్గం ప్రేక్షకులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, తీవ్రవాదం, నాజీ తత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ కూడా ఇలాంటి విమర్శలను చాలా కూల్ గా తీసుకుంటాడు. కానీ ఇది చాలదన్నట్టు మరో వివాదాన్ని జోడిస్తూ ‘స్వస్తిక్’ గుర్తును దెయ్యాల గుర్తుగా సందీప్ రెడ్డి వంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని, హిందువుల చిహ్నమైన ‘స్వస్తిక్’ను ద్వేషపూరిత చిహ్నంగా ఈ సినిమాలో వాడుతున్నారు కాబట్టి ‘యానిమల్’ మూవీని ఆపేయాలని కోరుతూ, ఈ మూవీని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేయాలని హిందూ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ వివాదం అంతా నిజానికి సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఏ లెవెల్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

- Advertisement -

గతంలో సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “అర్జున్ రెడ్డి” మూవీ రిలీజ్ టైములో కూడా ఇలాగే జరిగింది. దీనికి రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ విడుదల సమయంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ దాటుకుని వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘యానిమల్’ కూడా అలాగే హిట్ అవుతుందని అంటున్నారు సందీప్ ఫ్యాన్స్.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు