Sreeleela and Mrunal: దొందూ దొందే… మేకర్స్ ను ముప్పుతిప్పలు పెడుతున్న హీరోయిన్లు

ప్రస్తుతం టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్, శ్రీలీలలకు మంచి టైం నడుస్తోంది. స్టార్ హీరోలు అందరి దృష్టి వీరిద్దరి పైనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందుతున్న చాలా సినిమాలు వీరిద్దరి చేతుల్లోనే ఉన్నాయి. హీరోయిన్లుగా యూత్ లో సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు క్రేజీ స్టార్స్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో వీరిద్దరూ ప్రవర్తిస్తున్న తీరుతో మేకర్స్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయట. సినిమా ప్రమోషన్స్ టైంలో వీరిద్దరూ దొందూ దొందే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే హీరో హీరోయిన్లు ఇద్దరూ ఉండటం చాలా కీలకం. అయితే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్న “హాయ్ నాన్న” సినిమా విషయంలో ఆ ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేసింది. “హాయ్ నాన్న” మూవీ ప్రమోషన్స్ కు మృణాల్ ఠాకూర్ దూరంగా ఉండటం గమనార్హం. అయితే దానికి కారణం ఆమె హీరోయిన్ నటిస్తున్న మరో చిత్రం “ఫ్యామిలీ స్టార్”. ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మృణాల్ “హాయ్ నాన్న” మూవీ ప్రమోషన్స్ కి రాలేకపోతుందట.

ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండ డంతో నాని ప్రమోషన్ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడని సమాచారం. కొన్ని రోజుల క్రితం మృణాల్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ, మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కారణంగా ఆమె ప్రెజెన్స్ ఇప్పుడు చాలా ముఖ్యం. దీంతో ప్రమోషన్స్ లో హీరోయిన్ పాల్గొంటే బాగుండేదని, మరో సినిమా షూటింగ్ లో బిజీ అంటూ తమ సినిమా ప్రమోషన్స్ ని ఎగ్గొట్టడం ఏంటి అని మేకర్స్ బాధపడుతున్నారని టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఇక అదే విధంగా శ్రీలీల కూడా ‘ఆదికేశవ’ సినిమా ప్రమోషన్ లో ఇలాగే చేసింది. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ షూటింగ్ వల్ల ‘ఆదికేశవ’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా తక్కువగా కనిపించింది శ్రీలీల. ఈ సినిమా ఫస్ట్ డే రెస్పాన్స్ నెగిటివ్ గా ఉంది. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగలేదు. మేకర్స్ కూడా ఈ హీరోయిన్ల పరిస్థితిని అర్థం చేసుకుని ఏం అనలేకపోతున్నారు. మరి రాను రాను తమ నెక్స్ట్ సినిమాలకు ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రమోషన్స్ కు సమయాన్ని కేటాయిస్తారా లేక మేకర్స్ ను ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారా ? అనేది చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు