Elimination Day: ప్రశాంత్ ని పలకరించకుండా వచ్చేసిన అశ్విని! ఎందుకంటే?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేషన్ డే వచ్చేసింది. లాస్ట్ వీక్ ఎవరూ ఎలిమినేషన్ కాకపోవడంతో ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున మరో సారి రాగానే చెప్పడం జరిగింది. ఇక ఈ వారం ఆడియన్స్ అందరూ ఊహించినట్టుగానే అశ్విని ఎలిమినేట్ అయ్యింది.

లాస్ట్ వీకే అశ్విని ఎలిమినేట్ కావాల్సి ఉండగా, యావర్ ఎవిక్షన్ పాస్ వెనక్కి ఇచ్చేసినందున ఎలిమినేషన్ కూడా వాయిదా వేశారు. ఈ లోపు పెర్ఫార్మన్స్ లౌ ఉన్న కారణంగా అశ్విని ని గౌతమ్ ని వాళ్ళ ఆట తో తమని తాము నిరూపించుకోమని చెప్పారు. అయినా కూడా అశ్విని ఏమాత్రం ఆటలో పరిణితి కనబరచలేదు. పైగా ఎవర్ని నామినేట్ చేయడానికి సరైన రీసన్స్ లేవంటూ తనని సెల్ఫ్ నామినేట్ చేసుకుంది.

ఇక డబల్ ఎలిమినేషన్ లో ఫస్ట్ అశ్విని ఎలిమినేట్ అవగా, ఆల్రెడీ ఫిక్స్ అయిపొయింది కాబట్టి పెద్దగా ఏడవకుండా వచ్చేసింది. కానీ బయటికి వచ్చేటపుడు అందర్నీ విష్ చేసిన అశ్విని ప్రశాంత్ ని మాత్రం పట్టించుకోలేదు. కనీసం చూడకుండా వచ్చింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ని వాడితే ఎలిమినేట్ కావాల్సిన వాళ్ళని సేవ్ చేయొచ్చు అని నాగ్ అంటాడు. అది తన ఇష్టం ఎవర్ని కావాలో వాళ్ళని సేవ్ చేయొచ్చు, లేదా ప్రశాంతే వాడుకోవచ్చు అంటారు.

- Advertisement -

అప్పుడు తాను 14వ వారంలో ఎవిక్షన్ పాస్ ని ఏం చేయాలో డిసైడ్ అవుతానన్నాడు. కానీ అశ్విని తనని ప్రశాంత్ సేవ్ చేస్తాడని అనుకుంది. ఒకవేళ ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఇచ్చేసి అశ్విని ని సేవ్ చేసినా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎలిమినేట్ అయ్యేదన్నది వాస్తవం. అందుకే అశ్విని ప్రశాంత్ పైన కోపంతో పలకరించకుండా బయటికి వచ్చేసింది. ఇక ఆదివారం రోజు రెండో ఎలిమినేషన్ ఎవరు అవుతారో తెలుస్తుంది. ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు