Naga Vamsi : ‘లియో’ సినిమాపై షాకింగ్ కామెంట్స్… ఏకిపారేస్తున్న విజయ్ ఫ్యాన్స్

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ. ఈ స్టార్ ప్రొడ్యూసర్ పేరు చెప్పగానే తన సినిమాలపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ గుర్తొస్తుంది. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రీసెంట్ మూవీ “లియో”పై ఈ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో దళపతి విజయ్, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన “లియో” మూవీ అక్టోబర్ 19న రిలీజ్ అయింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న “లియో” మూవీ త్వరలో ఇంగ్లీషులోనూ ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలోనే “లియో’ సినిమాపై ప్రొడ్యూసర్ నాగ వంశీ చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. రీసెంట్ ఇంటర్వ్యూలో నాగ వంశీ “లియో” సినిమా తనకు నచ్చలేదని కామెంట్ చేశారు. అయితే ఈ మూవీని నాగ వంశీ స్వయంగా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం గమనార్హం.

20 కోట్లకు లియో మూవీని కొనుగోలు చేసిన నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే సినిమాపై ఉన్న హైప్, పండగ సీజన్ కావడంతో ఈ మూవీ ఫస్ట్ వీక్ లో మంచి వసూళ్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా త్వరగానే చేరుకుంది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మూవీ కలెక్షన్స్ పడిపోయాయి. అయితే ఫస్ట్ వీక్ వచ్చిన సాలిడ్ కలెక్షన్స్ తో బయ్యర్స్ సేఫ్ అయ్యారు. కాగా “లియో” మూవీ రిలీజ్ టైంలో ఈ యంగ్ ప్రొడ్యూసర్ తాను రిలీజ్ చేస్తున్న మొదటి, అలాగే చివరి డబ్బింగ్ చిత్రం “లియో”నే అని ప్రకటించారు. ఇక డబ్బింగ్ చిత్రాలతో తనకు సంబంధం ఉండదని, ఇకపై తను డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేయబోనని స్టేట్మెంట్ ఇచ్చేశారు.

- Advertisement -

సోషల్ మీడియాలో హీరో విజయ్ అభిమానులు చేస్తున్న ట్రోలింగ్, కామెంట్స్ వంశీ ఈ నిర్ణయానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ బ్యాక్ స్టోరీ ఎలా ఉన్నా కూడా “లియో” మూవీ తనకు నచ్చలేదంటూ నాగ వంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. “లియో” మూవీ ఓటిటిలో స్ట్రీమ్ అవుతుండగా, మరోవైపు విజయ్ ఫ్యాన్స్ నాగవంశీని టార్గెట్ చేస్తూ నచ్చనప్పుడు ఈ మూవీని ఎందుకు రిలీజ్ చేశావ్ అంటూ ఏకిపారేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు