Rules for Friendships at Work : మనుషుల్ని ఇలా డీల్ చేశారంటే ఆఫీస్ కూడా ఇల్లే !

ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ప్రొఫెషనల్ గా ఎదుగుతున్నారు. ఇక పనిలో భాగంగా ఇంట్లో కంటే ఆఫీస్ లోనే ఎక్కువ ఉంటున్నారు. ఆఫీస్ లోనే దాదాపు 9 నుంచి 10 గంటల పాటు కో వర్కర్స్ తో కలిపి గడపాల్సిన పరిస్థితి వస్తోంది. మరి అలాంటప్పుడు ఆఫీసులో ఫ్రెండ్స్ ఉండడం అవసరం కదా. కో వర్కర్స్ తో మంచి కమ్యూనికేషన్ ఉండడం చాలా అవసరం. మరి ఆఫీసులో కోవర్కర్స్ తో ఎలా స్నేహంగా మెలగాలి? ఫ్రెండ్స్ ని ఎలా సంపాదించుకోవాలి? అసలు ఆఫీసులో ఉండే తోటి వ్యక్తుల్ని ఎలా డీల్ చేయాలి ?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా మనకు స్నేహితుల అవ్వాలంటే వాళ్ల గురించి ఎంతో కొంత తెలియాలి. అలాగే మన గురించి కూడా వాళ్లకు అర్థం అవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదురుతుంది. కాబట్టి మెల్లగా మాటలు కలపండి. కానీ అవి కూడా ప్రొఫెషనల్ గానే ఉండాలి.

rules-for-friendships-at-work

- Advertisement -

కరోనా మహమ్మారి కారణంగా మనలో ఇప్పుడు చాలామంది రిమోట్ లేదా హైబ్రిడ్ మోడ్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కో వర్కర్స్ తో రిలేషన్ పెంచుకోవాలి అంటే ఆఫీస్ కి వెళ్లడం ముఖ్యం.

rules-for-friendships-at-work

ఆఫీస్ ఈవెంట్స్, గ్రూప్స్, సెలబ్రేషన్స్ లో పాలు పంచుకోండి. మీటింగ్ వంటి వాటిలో పాల్గొనండి. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మందితో కలిసే అవకాశం లభిస్తుంది. కాబట్టి మీకు ఉండే ఇంట్రెస్ట్ ఆధారంగా ఆఫీసులో మీలా ఆలోచించే గ్రూప్ తో చేరడం ఈజీ అవుతుంది. అలాగే మీ కోవర్కర్స్ కు పుట్టినరోజులు, యానివర్సరీ వంటివి చేయడం వల్ల మీతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

rules-for-friendships-at-work

మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే అడగండి. అలాగే మీరు కూడా చేతనైనంత సహాయం చేయండి. దీంతో కోవర్కర్స్ ఒకరితో ఒకరు వ్యక్తిగతంగా ఈజీగా కలవగలుగుతారు. అలాగే నమ్మకం కూడా కలుగుతుంది. అలాగని మీరు అందరితో స్నేహంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మీకు తగ్గట్టుగానే ఉండరు. కాబట్టి మీ స్వభావానికి సరిపోయే వారితో స్నేహం చేస్తే సరిపోతుంది.

ఇక వర్క్ ప్లేస్ లో ఫ్రెండ్స్ ఉంటే కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కొత్త కొత్త విషయాలను తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా వర్క్ ప్లేస్ లో స్నేహితుల అనుభవాలు చాలా విషయాలను నేర్పిస్తాయి. ఒకరి వల్ల ఒకరు ఇన్స్పైర్ అవ్వచ్చు. ఆఫీసులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే మీ జాబ్ కు సంబంధించిన నెట్వర్క్ ఏర్పడుతుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు