Jabardasth Faima: హాస్పిటల్‌లో చేరిన జబర్ధస్త్ ఫైమా… అసలేమైందంటే?

తెలుగు బుల్లితెర పైన ఎన్నో షోలు ఉన్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమానికి సైతం మంచి ప్రేక్షక ఆదరణ ఉన్నది. ముఖ్యంగా ఇందులో లేడీ కమెడియన్ గా పేరు పొందిన జబర్దస్త్ ఫైమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. పటాస్ షో తో మొదటిసారి తన కెరీర్ని ప్రారంభించిన ఈమె జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మంచి పాపులారిటీ అందుకున్నది. అలా అతి తక్కువ సమయంలోనే తన కామెడీ పంచ్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఫైమా కోసమే స్కిట్లు చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

అయితే ఈ క్రేజ్ తోనే ఫైమా బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత ప్రేక్షక ఆదరణ పొందింది. జబర్దస్త్ లో ఉన్నప్పుడే ఫైమా… ప్రవీణ్ అనే కమెడియన్ ను ప్రేమించడం జరిగింది. అతనిని పెళ్లి చేసుకుంటానని కూడా తెలియజేయడం జరిగింది. కానీ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య కాస్త విభేదాలు మొదలయ్యాయని ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.. ఫైమా పూర్తిగా మారిపోయింది అంటూ తెలిపారు.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫైమా ఒకపక్క షోలో మరొకపక్క జబర్దస్త్ షోలో చాలా బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఫైమ ఒక్కసారిగా ఆస్పత్రిలో చేరినట్లుగా పలు రకాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఫైమా ఒక వీడియోని షేర్ చేస్తు “నా గతమంతా మరిచిపోయాను” అంటూ రాసుకొచ్చింది. కానీ ఫైమా మాత్రం హాస్పిటల్ కు ఎందుకు చేరింది అనే విషయం మాత్రం అభిమానులను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది.

- Advertisement -

అయితే అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ ఫైమా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు సైతం ఫైమా ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నారు. మరి కొంతమంది అక్క మీకు ఏమైంది త్వరగా కోలుకోండి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైమా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు