Bigg Boss Telugu: పవన్ కళ్యాణ్‌ను అప్పడు చూసి భయపడ్డాను – బిగ్ బాస్ అశ్విని

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పవర్ స్టార్ కి అబ్బాయిలే కాకుండా అమ్మాయిల ఫాలోయింగ్ కూడా భారీగా ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లిన అశ్విని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సొట్టబుగ్గల పిల్లకి బిగ్ బాస్ లో బాగానే ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అశ్విని అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది.

బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వకముందు ఈమె అమీర్ పేటలో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. గబ్బర్ సింగ్ సినిమాలో ఓ సన్నివేశంలో చపాతి పిండి కలుపుతూ, పవన్ కళ్యాణ్ ని చూస్తూ చపాతీ పిండిని తెగ పిసికేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో సందడి చేస్తూ ఉండడంతో గతంలో ఈమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

“పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్టైల్ అంటే ఇంకా ఇష్టం. ఆయనతో కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో కలిసి నటించిన తర్వాత నేను ఆయనకి పెద్ద అభిమానిని అయ్యాను. పవన్ సార్ సెట్స్ లో చాలా సరదాగా ఉండేవారు. సార్ ఏం తింటారో అక్కడ ఉండే వారందరికీ అదే పెట్టించేవారు. అది ఆయన వ్యక్తిత్వం. నేను ఎక్కువగా క్యారీవాన్ లో సార్ తో పాటు ఉండేదాన్ని. ఎప్పుడూ క్యారీవాన్ లో ఉంటే బోర్ కొడుతుందని.. సార్ నేను వెళ్లి కారులో కూర్చుంటా అని చెప్పి వెళ్లాను. ఆ సమయంలో ఆడెవడన్నా.. వీడెవడన్నా సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నేను కారు లోనే ఉండిపోయాను. పవన్ సార్ తో సహా అందరూ నాకోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. కో డైరెక్టర్లు వచ్చి తిట్టారు. సార్ సారి అని చెప్పగా.. “ఇట్స్ ఓకే అశ్విని ఫస్ట్ నువ్వు చిల్ అవ్వు.. సైలెంట్ గా ఉండు” అని పవన్ సార్ కూల్ చేశారు. అప్పుడు ఆయన నాకు దేవుడిలా కనిపించారు అని చెప్పుకొచ్చింది అశ్విని.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు