Vanitha Vijay Kumar: వనిత విజయ్ కుమార్ పై దాడి.. ముఖం మొత్తం గాయాలతో..!

ప్రముఖ కోలీవుడ్ నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం పైన అలాగే తనకు జరిగిన మూడో పెళ్లి పైన ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. అంతేకాదు తన మూడో పెళ్లి చుట్టూ అనేక కోణాలలో వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అలా ఎప్పుడూ వివాదాలలో ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన కూతురు కోసం పోరాడుతోందని చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్తే వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక బిగ్ బాస్ హౌస్ లో ఉండగా ఆమె కోసం బయట వనిత సపోర్టుగా నిలిచింది. అంతేకాదు తన కూతురు ఏం చేసినా కూడా మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో తన కూతురికి ఫాలోవర్స్ ను పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు.. బయట వారి అభిమానుల మధ్య వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చాలన్న నియమం లేదు. ఒక కంటెస్టెంట్ అంటే కొందరికి ఇష్టం ఉండొచ్చు.. ఇంకొందరికి ఇంకొక కంటెస్టెంట్ ఇష్టం ఉండవచ్చు.. అలాగే జోవిక – ప్రదీప్ ఫాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ప్రదీప్ ఫ్యాన్స్ మీద కూడా వనిత కామెంట్లు చేస్తూ ఉంటుంది.

అయితే ఆమె మీద దాడి చేసింది కూడా వీరే అయి ఉంటారని కొంతమంది భావిస్తున్నారు..ఇకపోతే తాజాగా ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..” నా మీద జరిగిన ఈ దారుణమైన దాడి గురించి నేను ధైర్యంగా పోస్ట్ వేస్తున్నాను.. బిగ్ బాస్ షో అనేది కేవలం ఒక ఆట మాత్రమే.. ఇలా నాపైన మీరు దాడి చేయడం.. హింసను సృష్టించడం సరైన పద్ధతి కాదు..” అంటూ వనిత పోస్ట్ చేసింది.. అయితే దీని పైన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉండగా కొంతమంది ప్రదీప్ ఫ్యాన్సే ఇలా చేసి ఉంటారు.. అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

అయితే ఇంకొంతమంది వాళ్లే చేసి ఉంటారన్న గ్యారెంటీ ఏంటి అంటున్నారు.. వాస్తవానికి ఆమెకు ప్రపంచంలో చాలామందితో గొడవలు ఉన్నాయి ఎవరు ఆమె మీద దాడి చేశారు ఎలా చెప్పగలరు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఒక ఆట కోసం ఇలా దారుణంగా ఆమెను ఇబ్బంది పెట్టడం హింసకు పాల్పడడం తప్పు అంటూ వనితకు అండగా నిలుస్తున్నారు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు