Tamannaah: తమన్నాకు ఆ డైరెక్టర్ తో విభేదాలు ఉన్నాయా..?

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట శ్రీ సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హ్యాపీడేస్ సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది.. ఆ తర్వాత ఆవారా సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో, సినిమాలలో తన గ్లామర్ తో కుర్రకారులను ఒక ఊపు ఊపేస్తోంది.

తాజాగా డైరెక్టర్ అనిల్ రావు పూడి తో కొన్ని విభేదాలు ఉన్నాయంటూ పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య గొడవ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.. తమన్నా, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు F-2,F-3 సినిమాలు మాత్రమే.. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రాలలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ నటించారు. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావుపూడి తమన్నా తనకు జరిగిన గొడవలపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి మాట్లాడుతూ.. ఒకరోజు చాలా మంది ఆర్టిస్టులతో కలిసి ఒక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో తమన్నా షూటింగ్ అయిపోగానే తన టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పిందట.. ఇక ఉదయాన్నే రమ్మంటే తాను ఉదయం జిమ్ముకు వెళ్లాలి కుదరదని చెప్పిందని తెలిపారు.

- Advertisement -

ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ఏర్పడడం జరిగిందని తెలిపారు. కానీ కొద్ది రోజులకి మళ్ళీ మేము కలిసిపోయి సినిమా షూటింగ్లో పాల్గొన్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటీవలే బాలయ్య తో కలిసి భగవంత్ కేసరి సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తమన్నా మాత్రం ఒక వైపు వెబ్ సిరీస్ లతో సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తుందని వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎట్టకేలకు డైరెక్టర్ అనిల్ రావుపూడి తమన్నాతో విభేదాలపై క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయానికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు