GameChanger: చెర్రీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఇక రణరంగమే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న హీరో రామ్ చరణ్ ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు..RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ ఇటీవలే డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియరా అద్వానీ నటిస్తున్నది. అలాగే హీరోయిన్ అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ తదితర నటీనటుల సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ పోస్టర్స్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక కొత్త షెడ్యూల్ కర్ణాటకలోని మైసూరులో జరుగుతున్నది. దాదాపుగా 12 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఇందులో ద్విపాత్రాభినయంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మైసూరులో ప్రభుత్వ అతిథి గృహంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ తమిళ నటుడు ఎస్ జె సూర్య.. రామ్ చరణ్ ,సునీల్ పైన టాకీ భాగాలను సైతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ ఇందులో 30 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కూడా చేయబోతున్నారు. దాదాపుగా తొమ్మిది రోజులపాటు ఈ షెడ్యూల్ జరగబోతున్నట్లు తెలుస్తోంది .అలాగే ఎస్ జె సూర్య , రామ్ చరణ్ మధ్య ఈ షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇందుకు సంబంధించి షూటింగ్ స్టిల్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూడా ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్ తో రామ్ చరణ్ కు సరిపోయే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లో కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని రామ్ చరణ్ అభిమానులు సైతం చాలా దృఢంగా నమ్ముతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.

గేమ్ చేంజర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథను అందించినట్లుగా తెలుస్తోంది.అలాగే డైలాగ్ సైతం సాయి మాధవ్ బుర్ర అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తూ ఉన్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉండడం గమనార్హం
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు