Thalapathy vijay: ఇది ఫ్యానిజం కాదు. అంతకు మించి..కానీ శృతి మించితే?

Thalapathy vijay:

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుల్లో విజయ్ ఒకడు. ఇక తుపాకీ, అదిరింది, మాస్టర్ వంటి సినిమాలతో తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు ‘లియో’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి.

తాజాగా ట్రైలర్ రిలీజ్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రికార్డుల వేట మొదలెట్టారు. అయితే ‘అభిమానులందు విజయ్ అభిమానులు వేరయా’ అన్నట్టు ఈ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో తెలిసిందే. విజయ్ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నిమిషాల్లో ట్రెండ్ చేసి పడేస్తారు. పైగా కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి కూడా ఎంతో ముందుంటారు. ఇది ఒకప్పుడు లేకపోయినా గత ఐదారేళ్లుగా పీక్స్ కి చేరింది. ముందుగా కంటెంట్ బాగున్న సినిమాలకే ఇలాంటి రచ్చ చేసినా కూడా, లాస్ట్ ఇయర్ డిజాస్టర్ అయిన “బీస్ట్”, ఈ ఇయర్ వచ్చిన “వారిసు” సినిమాలకి విజయ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

ప్లాప్ కావాల్సిన వారిసు సినిమాను ఐదారు సార్లు ఫ్యాన్స్ ఇష్టం లేకపోయినా చూసి, కలెక్షన్లు బయ్యర్ల చేతిలో పెట్టారు. 200కోట్ల లోపే ఎండ్ అవ్వాల్సిన కలెక్షన్లను 300 దాకా లాక్కొచ్చారు. ఇక తాజాగా లియో ట్రైలర్ రిలీజ్ అయిన 21 నిమిషాల్లోనే “1మిలియన్” లైక్స్ కొట్టి లియో ట్రైలర్ కి ఆల్ టైం రికార్డు దక్కేలా చేసారు.

- Advertisement -

గతంలో ‘కెజిఎఫ్2’ ట్రైలర్ రిలీజ్ టైం లో యష్ ఫ్యాన్స్ చేసిన రచ్చని పర్సనల్ గా తీసుకున్న విజయ్ ఫ్యాన్స్ లియో ట్రైలర్ తో ఆల్ టైం రికార్డు సెట్ చేసారు. అయితే ఇది సోషల్ మీడియా వరకు బాగానే ఉన్నా, థియేటర్ల కి వచ్చేసరికి సినిమాని సినిమాలాగే చూడాలన్న విషయం విజయ్ ఫ్యాన్స్ గుర్తుంచుకుంటే మంచిది. లియో ట్రైలర్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేనిపక్షంలో మూవీ గనుక బాగా లేకపోతే విజయ్ ఫ్యాన్స్ మరీ నెత్తినెట్టుకుని ఆడించాల్సిన పని లేదని ట్రేడ్ విమర్శకులు అంటున్నారు.

వారిసు సినిమా టైంలో తమిళ్ నాడులో అరుణాచలం దగ్గర ఓ థియేటర్లో సినిమా హౌస్ ఫుల్ అవడానికి కొందరు విజయ్ ఫ్యాన్స్ 5లక్షలు పెట్టి టిక్కెట్లు కొన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. రికార్డు బ్రేక్ చేసే పిచ్చి, సోషల్ మీడియా వరకే ఉంటె మంచిదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. మరి అప్పులు చేసి, ఆస్తులు అమ్మి చూసేంతగా శృతి మించకూడదని అంటున్నారు. మరి లియో రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఇది ఎంత వరకు అర్ధం చేసుకుంటారో అనేది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు