Sitara: అప్పుడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన సితార.. ఇన్ స్టా రీల్ వైరల్..!

మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తండ్రితో సమానంగా ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య 1.6 మిలియన్ వరకు చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పండుగల సమయంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేసే సితార తెలుగు పండగలు వచ్చాయంటే చాలు సాంప్రదాయ దుస్తులు ధరించి అద్భుతంగా నృత్యం చేస్తూ ఆ వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక అలా మరింత పాపులారిటీ దక్కించుకున్న సితార ఇప్పుడు తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేయడం గమనార్హం. క్రిస్మస్ పండుగకు ఇంకా 19 రోజులు ఉండగానే సితార అప్పుడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసింది. ఈ సందర్భంగా సితార కోసం మహేష్ బాబు తన ఇంటిలో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయగా.. ఆ ట్రీ ముందు సితార శాంటా క్లాస్ క్యాప్ పెట్టుకొని క్రిస్మస్ పాటకి రీల్ చేసింది. అంతేకాదు ఈ రీల్ ని తన ఇన్స్టా లో షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది
ఇకపోతే మహేష్ బాబు కూతురిగా మరింత పాపులారిటీ దక్కించుకున్న సితార ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతూ ఉండడం నిజంగా సంతోషకరమైన విషయమని చెప్పవచ్చు.

ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఇందులో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి , శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్, శ్రీలీల పై ఒక పాట చిత్రీకరించడానికి చిత్ర బృందం కేరళ వెళ్లడానికి సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే సితార షేర్ చేసిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు