Savitri: ఆ చిన్న సంతకం సావిత్రి పెళ్లి రహస్యాన్ని బయటపెట్టిందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అగ్ర నటులతో పోటీపడి మరీ నటించి అగ్ర కథానాయికగా మంచి పేరు దక్కించుకున్న మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు లో 1934 డిసెంబర్ 6వ తేదీన జన్మించిన మహానటి నేటితో 89 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టం పెళ్లి గురించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది .దాని గురించి చదివి తెలుసుకుందాం.

తమిళ హీరో జెమినీ గణేషన్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గణేషన్ కి అప్పటికే వివాహం అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. ఇక పెళ్లి సమయానికి సావిత్రి వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఈ పెళ్లి కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగింది. అయితే ఈ పెళ్లి విషయం ఎలా బయటపడింది అనే విషయం కూడా చాలామందికి తెలియదని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే మహానటి సినిమాలో సావిత్రి, గణేషన్ ప్రేమ లేఖలు బయటపడడం వల్లే పెళ్లి విషయం అందరికీ తెలిసినట్లు చూపించారు అయితే ఆ పెళ్లి విషయం బయటపడడానికి ఇండస్ట్రీలో మరో కారణం కూడా వినిపిస్తూ ఉంటుంది.

సావిత్రమ్మ చేసిన ఒక చిన్న సంతకంతోనే తనకు పెళ్లి జరిగిందన్న విషయం బయటపడిందని చెబుతూ ఉంటార. గణేషన్ తో పెళ్లి సమయానికి సావిత్రి స్టార్డంకి చేరుకున్నారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. అలా తెలుగు , తమిళ్లో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఒక ఇంటర్నేషనల్ సబ్బు కంపెనీ సావిత్రిని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా చూపించడానికి సిద్ధం అవ్వగా.. అందుకోసం ఆమెతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. ఇలా అగ్రిమెంట్ లో బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసేటప్పుడు సావిత్రి గణేషన్ అని సైన్ చేశారట సావిత్రి .అలా కంగారులో తమ పెళ్లి విషయాన్ని ఆమె బయట పెట్టేసారని చెబుతూ ఉంటారు. ఇకపోతే సావిత్రి , గణేషన్ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. విజయ్ చాముండేశ్వరి , సతీష్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇకపోతే 47 సంవత్సరాల వయసులో 19 నెలల పాటు కోమాలో ఉండి స్వర్గస్తులయ్యారు సావిత్రి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు