Sankranthi Movies 2024 : సినిమా ఏదైనా నరకడం మాత్రం పక్కా… నాలుగు సినిమాల్లో ఇదే కామన్ పాయింట్

Sankranthi Movies 2024: ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాలలో ఒకే కామన్ పాయింట్ ఉందన్న విషయాన్ని గమనించారా? సినిమా ఏదైనా, ఏ జోనర్ లో ఉన్నా నరకడం మాత్రం పక్కా. ఈ సారి సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న టాలీవుడ్ సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఇదే.

1. హనుమాన్

Sankranthi Movies 2024 : The movie is sure to be hellish... This is the common point in all four movies.
ముందుగా “హనుమాన్” విషయానికి వస్తే సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేసి, కథపై తమకున్న నమ్మకాన్ని బయట పెట్టారు మేకర్స్. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన “హనుమాన్” మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ పెరిగింది. ఇక ఆ తర్వాత థియేటర్ల విషయంలో జరిగిన గొడవ కారణంగా “హనుమాన్”పై అందరికీ బాగా సింపథి పెరిగింది. కంటెంట్ కూడా ఫర్వాలేదు అన్నట్టుగా ఉండడంతో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక “హనుమాన్” మూవీ సాధారణ కమర్షియల్ తెలుగు చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, విపరీతమైన హింస లేని ఏకైక సంక్రాంతి మూవీ ఇదే.

- Advertisement -

2. గుంటూరు కారం

Sankranthi Movies 2024 : The movie is sure to be hellish... This is the common point in all four movies.
ముందు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” మూవీ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ చెప్పుకొస్తున్నారు మేకర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాలో భారీ యాక్షన్స్ సన్నివేశాలు, కావలసినవి కమర్షియల్ ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ రోజు అంటే జనవరి 12న అర్ధరాత్రి నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న “గుంటూరు కారం” మూవీకి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

3. సైంధవ్

Sankranthi Movies 2024 : The movie is sure to be hellish... This is the common point in all four movies.
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ మూవీగా రూపొందుతున్న “సైంధవ్” మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో వెంకీ ఇదివరకు ఎన్నడూ లేనంత వైలెంట్ గా కనిపించాడు. ట్రైలర్ లో ఉన్న కొన్ని హింసాత్మక సన్నివేశాలు చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తన కూతురి కోసం ఈ హీరో ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంతకైనా తెగిస్తాడు అనే విషయం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ జనవరి 13న థియేటర్లకి రావడానికి సిద్ధంగా ఉంది.

4. నా సామి రంగ

Sankranthi Movies 2024 : The movie is sure to be hellish... This is the common point in all four movies.
కలర్ ఫుల్ రొమాంటిక్ విలేజ్ ఎంటర్టైనర్ “నా సామి రంగ”. చాలా రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున ఈ సినిమాతో జనవరి 14న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఈ మూవీలో కూడా తీవ్రమైన యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ లో కిష్టయ్య వైలెంట్ మోడ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అలాగే నాగార్జున నుంచి ఎక్స్పెక్ట్ చేసే రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా మూవీలో ఎక్కువగానే ఉన్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు