Latha Sree: దానికోసమే అమ్మని చంపేశారు – నాగశౌర్య మేనత్త..!

Latha Sree:  అలనాటి స్టార్ హీరోయిన్ లతా శ్రీ గురించి ఈ తరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఈమె ఎవరో పెద్దగా ఈ తరం ప్రేక్షకులకు తెలియదు. కానీ ప్రముఖ యంగ్ హీరో నాగశౌర్య మేనత్త అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లతా శ్రీ తన తల్లి మరణం వెనుక ఉన్న విషయాన్ని తెలిపి ఎమోషనల్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 1990 లలో ఆర్టిస్టుగా భారీ పాపులారిటీ దక్కించుకున్న లతా శ్రీ.. హీరోయిన్‌గా కెరియర్ మొదలుపెట్టి… ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు.

అలా అబ్బాయి గారు, అల్లరోడు, ముద్దుల మేనల్లుడు, ఆ ఒక్కటి అడక్కు, యమలీల వంటి పలు చిత్రాలలో నటించిన ఈమె, గ్లామర్‌తో పాటు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంది. పెళ్ళి తర్వాత నటనకు దూరమై కుటుంబానికి పరిమితమైన ఈమె ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోగా కొనసాగుతున్న నాగశౌర్య… లతా శ్రీ కి మేనల్లుడు. ఆమె అన్న కొడుకే ఈ టాలీవుడ్ యంగ్ హీరో. ఈమె ప్రస్తుతం అన్న కుటుంబానికి దూరంగా ఉంది.

లతా శ్రీ మాట్లాడుతూ.. “నాకు ఎక్కువగా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ మా అమ్మ తెలుగులోనే సినిమాలు చేయమని చెప్పడంతో ఇక్కడే చేస్తూ ఉండిపోయాను. మలయాళం లో కూడా అవకాశాలు వచ్చాయి కానీ వెళ్ళలేదు. అయితే మలయాళంలో ఒక డైరెక్టర్ అందరి ముందు నాకు నటన రాదు అని ఎగతాళి చేశారు అప్పటి నుంచి మలయాళం గుమ్మం కూడా తొక్కలేదు”

- Advertisement -

“ఇక ఒకరోజు మా అమ్మకి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చేర్చాము. బాగానే ఉంది. మాట్లాడుతోంది. డిశ్చార్జ్ చేస్తారు అనుకుంటే కావాలని 18 రోజులు ఐసీయూలో పెట్టారు. డబ్బు కోసం చేస్తున్నారని మాకు తెలుసు. అందుకే తీసుకెళ్లి పోదాం అనుకున్నాము. ఇక ఆ విషయం వారికి తెలిసింది. ఆ మరుసటిరోజే అమ్మను చంపేశారు” అంటూ ఎమోషనల్ అవుతూ తెలిపింది లతా శ్రీ. ఇకపోతే డబ్బు కోసమే తన తల్లిని చంపేశారని ఈమె చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు.

తనను తెలుగు దర్శకులు బాగా ప్రోత్సహించారని ముఖ్యంగా ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి మంచి పాత్రలు ఇచ్చి తనను ప్రోత్సహించారని తెలిపింది. కృష్ణ సినిమాలలో ఎక్కువగా అవకాశాలు రావడం తన అదృష్టంగా భావిస్తుంటానని తెలిపింది లతాశ్రీ .. ప్రస్తుతం ఈమె తన తల్లి మరణం గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు