Sankranthi Movies 2024 : ఏ మూవీ టికెట్ రేట్ ఎంత?

Sankranthi Movies 2024 : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగైన సంక్రాంతికి సినిమా పండగ కూడా జరగబోతోంది. ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు సినిమాల్లోనూ తేజ సజ్జ – డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న “హనుమాన్” మూవీ పైన ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన “గుంటూరు కారం” మూవీకి కూడా భారీ హైప్ ఉంది. ఈ రెండు సినిమాలు జనవరి 12న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరి 13న వెంకటేష్ హీరోగా నటిస్తున్న “సైంధవ్”, జనవరి 14న అక్కినేని నాగార్జున “నా సామి రంగ ” సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్స్ సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లలో ఎలా ఉన్నాయి? అంటే…

1. గుంటూరు కారం

Sankranthi Movies 2024 : movie ticket rates?

- Advertisement -

“గుంటూరు కారం” మూవీకి మొదటి పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈనెల 12 నుంచి 18 వరకు “గుంటూరు కారం” మూవీ టికెట్ రేట్లు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ లలో గరిష్టంగా రూ. 250, సెకండ్ క్లాస్ రూ. 175, థర్డ్ క్లాస్ రూ. 100 ఉన్నాయి. మల్టీప్లెక్స్ లలో రూ.450. ఏపీలోని సింగల్ స్క్రీన్ లలో హైయెస్ట్ టికెట్ ధర రూ. 200, మల్టీప్లెక్స్ లలో రూ. 230.

2. హనుమాన్

Sankranthi Movies 2024 : movie ticket rates?
పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు వేసి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న “హనుమాన్” టికెట్ రేట్ల విషయానికి వస్తే ఏపీలోని మల్టీప్లెక్స్ లలో రూ. 177, సింగిల్ స్క్రీన్ లలో రూ. 175 నుంచి రూ. 100 రూపాయల వరకు టికెట్లు అమ్ముతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే నైజాంలో ఈ మూవీకి పెద్దగా థియేటర్లేమీ దొరకలేదు. మల్టీప్లెక్స్ లోను సాధారణ రేట్లకే టికెట్లను అమ్ముతున్నారు.

3. సైంధవ్

Sankranthi Movies 2024 : movie ticket rates?
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ మూవీగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సైంధవ్”. ఈ సినిమాకు టికెట్ ధరలు రీజనబుల్ గానే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్ లలో గరిష్ట టికెట్ రేటు రూ.175, మల్టీప్లెక్స్ లలో రూ. 295.

4. నా సామి రంగ

Sankranthi Movies 2024 : movie ticket rates?
సంక్రాంతిని సెంటిమెంట్ గా భావించే నాగార్జున “నా సామి రంగ” అనే మూవీతో ఈసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మూవీ టికెట్ ధరలు తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో రూ.295, సింగల్ స్క్రీన్ లలో రూ.175. “నా సామి రంగ” మూవీతో పాటు “సైంధవ్” మూవీ టికెట్ బుకింగ్ ఏపీలో ఇంకా స్టార్ట్ కాలేదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు