Lady Powerstar: బాలయ్యకే ఝలక్ ఇచ్చిన సాయి పల్లవి ?

సాయి పల్లవి… ఇండస్ట్రీలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్స్పోజింగ్ లేకుండా, మేకప్ లేకుండా, పాత్రలకు బలం ఉన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది సాయి పల్లవి. సిని పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అనే పేరు సంపాదించుకుంది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డం ఏ మాత్రం తక్కువగా లేదు.

ఈమె ఓ గొప్ప నటి మాత్రమే కాదు… ఓ గొప్ప డాన్సర్ కూడా. ఇక రెగ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేయకపోగా… నష్టపోయిన నిర్మాతలకు సాయి పల్లవి ఆ డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈమెకి మంచి క్రేజ్ ఉంది. అయితే హీరో బాలకృష్ణతో సినిమా చేయడానికి చాలామంది రెడీ అవుతూ ఉంటారు. కానీ నేచురల్ స్టార్ సాయి పల్లవి మాత్రం నో చెప్పిందని సమాచారం. బాలయ్యతో నటించడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని ఎంతోమంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటే…ఈమె మాత్రం ఆయనతో నటించే అవకాశాన్ని వదులుకుంది.

- Advertisement -

బాలయ్య…. వీర సింహారెడ్డి సినిమాతో ఈ ఏడాది మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో చెల్లిగా… వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో థియేటర్లో ఈలలు వేయించింది. అయితే ఈ పాత్ర మొదట సాయి పల్లవికే వరించిందట. గోపీచంద్ మలినేని మొదటిగా వరలక్ష్మి పాత్ర కోసం సాయి పల్లవిని అడగ్గా… నిర్మోహమాటంగా తిరస్కరించిందని సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు