S. Shankar : భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ?

కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింట్ టైటిల్ తో ఈ సినిమా సూమారు సగం షూటింగ్ జరుపుకుంది. కొన్ని రోజుల్లోనే RC15 కు గుమ్మడికాయను కొట్టాలని శంకర్ భావిస్తున్నాడు. దీని తర్వాత కమల్ హాసన్ తో భారతీయుడు2, రణ్ వీర్ సింగ్ తో బాలీవుడ్ లో అపరిచితుడు రీమేక్ చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉన్నా, వీటి కంటే ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 చేస్తున్నాడు శంకర్.

అయితే శంకర్ తర్వాత సినిమాపై కోలీవుడ్ లో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. శంకర్ తన తర్వాత సినిమాను రూ. 1000 కోట్లతో తెరకెక్కించబోతున్నాడట. అండర్ వాటర్ లో సాగే సైన్స్ ఫిక్షన్ స్టోరీని శంకర్ రెడీ చేశారని సమాచారం అందుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో ఇద్దరు స్టార్ హీరోలు నటించనున్నారని తెలుస్తోంది. అందులో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అని, మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడు అని తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. కానీ, రామ్ చరణ్ తో మరో భారీ సినిమా చేయాలని శంకర్ భావిస్తున్నాడని తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. మరి ఈ రెండు వార్తలు నిజమా కాదా, అని తెలియాలంటే, డైరెక్టర్ శంకర్ స్పందించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు