Anupama: అందుకే ప్రమోషన్స్ కి రాలేకపోతున్నా

యంగ్ హీరో నిఖిల్ తన కార్తికేయ 2 ప్రమోషన్స్ లో బిజీ అయ్యాడు. సినిమాలో కథానాయికగా నటించిన అనుపమ పరమేశ్వరన్ ప్రమోషన్స్ కనిపించడం లేదు. అనుపమ ప్రమోషన్స్‌ను ఎందుకు హాజరు కావట్లేదు అనే దానిపై ఇప్పటికే రూమర్లు మొదలయ్యాయి. అవి నిజమని నమ్మేలోపు అనుపమ క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

కార్తికేయ 2ని ఎందుకు ప్రమోట్ చేయడం లేదనే విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. ‘హే నేను కార్తికేయ ప్రమోషన్స్‌లో ఎందుకు చేరలేకపోతున్నాను అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను… నేను నిరంతరం షూటింగ్ చేస్తున్నాను. మరియు ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ డేట్‌లు ఉన్న మరో రెండు సినిమాల కోసం చాలా కాలం నుండి ప్లాన్ చేస్తున్నారు… కానీ దురదృష్టవశాత్తు, కార్తికేయ విడుదల తేదీలో చాలా మార్పులు ఉన్నాయి మీ అందరి కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను .. మా సినిమా కోసం మీరు చేసిన అన్ని ప్రయత్నాలకు నా టీమ్ మొత్తానికి, ముఖ్యంగా నిఖిల్ గారికి అదనపు ప్రయత్నాలకు చాలా ప్రేమ.’

మొత్తంగా , కార్తికేయ 2 ప్రమోషన్‌లకు హాజరుకాకపోవడానికి ముందస్తు కమిట్‌మెంట్‌లు తప్ప మరేమీ అడ్డు లేవని ఆమె స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు