Damini: రతికాను అతడు వాడుకొని వదిలేసాడు- దామిని షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి పెద్దగా గుర్తింపు తెచ్చుకున్న రతిక .. బిగ్ బాస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్గా అడుగు పెట్టిన తర్వాత ఆమెకు భారీ గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో వేదికగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె ప్రేమాయణం కాస్త బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే సింగర్ దామిని రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ కావడంతో దామిని వీరికి సంబంధించిన కీలక విషయాలను ఆమె తాజాగా వెల్లడించింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రతిక అత్యంత నెగెటివిటీ ని మూటగట్టుకున్న కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది.

పి ఆర్ టీ ని సిద్ధం చేసుకుని హౌస్ లోకి వెళ్ళిన రతిక మొదటి రోజు నుంచి ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ చేసుకొని ఇప్పుడు మరింతగా చెలరేగిపోతోంది. ఇకపోతే హౌస్ లో ఎఫైర్ పెట్టుకోవాలనేది కూడా ఆమె ప్రణాళికలో ఒక భాగమేనట. అందుకే మొదట పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత యావర్ అంటూ ఇద్దరినీ కూడా లైన్లో పెట్టేసింది. ఇకపోతే రతిక గేమ్ లో భాగంగా ఆడిన మరో నాటకం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం.. ఈ విషయాన్ని తనకు ఫేవర్ గా వాడుకోవాలని.. సింపతి రాబట్టాలని ప్లాన్ చేసిందట. అయితే తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉందని.. అతడు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాడని.. తనను చాలా మిస్ అవుతున్నాను అంటూ కన్నీరు కూడా పెట్టుకుంది రతిక. హౌస్ లో బ్రేకప్ మేటర్ లీక్ చేయగానే ఆమె పి ఆర్ టీం రతిక , రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై రాహుల్ కూడా మండిపడ్డారు..

రతికా గేమ్ ని నమ్ముకోకుండా ఇతరుల ఫేమ్ వాడుకోవాలని అనుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు పెట్టాడు. అయితే ఇది కూడా రతిక కు మైనస్ అయ్యి నాలుగో వారమే ఎలిమినేట్ అయింది. కానీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది. ఇకపోతే తాజాగా రాహుల్, రతిక ప్రేమ వ్యవహారం గురించి తెలిసిన సింగర్ దామిని తాజాగా వెల్లడించింది. దామిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మూడో వారమే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. ఇకపోతే హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లగానే తనకు రాహుల్ సిప్లిగంజ్ ఫోన్ చేశాడట. ఆ తర్వాత తనను కలిశాడని రాహుల్ వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోడు కాకపోతే రతిక హౌస్ లో చేసిన పనికి నాతో అన్ని విషయాలు మాట్లాడాడు అని ఆమె తెలిపింది. ఇకపోతే వారు గతంలో డేటింగ్ చేసిన విషయం నిజమేనని వ్యక్తిగత కారణాలవల్లే విడిపోయారని స్పష్టం చేశారు దామిని

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు