Payal Rajput: పాయల్ మరీ ఇంత తేడానా.. ఆమె తోనే పెళ్లి అంటూ..!

పాయల్ రాజ్ పుత్.. తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై .. మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్న పాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం విషయంలో.. టాలెంట్ విషయంలో రెండింటిలో కూడా ముందే ఉన్నప్పటికీ కూడా సరైన సక్సెస్ లేక రేసులో వెనుకబడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి కానీ స్క్రిప్ట్ ఎంపిక విషయంలో తడబడిన ఈ ముద్దుగుమ్మకు వరుసగా డిజాస్టర్లు మిగిలాయని చెప్పవచ్చు.

ఇకపోతే ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత మళ్లీ అదే డైరెక్టర్ దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా ఖచ్చితంగా తన కెరియర్ మలుపు తిప్పే సినిమా అని ఆమె చెప్పింది అందుకు తగ్గట్టుగానే సినిమా విడుదలయ్యి మొదటి ఆట నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు.

ఇక సినిమా టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా అదిరిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.13 కోట్లకు జరగగా.. పాయల్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.6 కోట్ల షేర్ వసూలు వచ్చాయని బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవాలంటే మరో రూ.7 కోట్లు సాధిస్తే చాలని సమాచారం.

- Advertisement -

ఇక ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని బోల్డ్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈమె చేసిన కామెంట్లు చూసి ఈమె తేడానా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి పాయల్ అన్న మాటలు ఏమిటో అనే విషయానికొస్తే.. ఆమె మాట్లాడుతూ.. నాకు కరీనాకపూర్ అంటే ఎంతో ఇష్టం.. ఆమెతో కలిసి సెల్ఫీ దిగడానికి చాలా కష్టపడ్డాను. నాకు ఆమె అంటే ఎంత ఇష్టం అంటే.. ఒకవేళ అవకాశం దొరికితే ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను..

అంత ఇష్టం నాకు.. అంటూ కామెంట్లు చేసింది. అయితే ఇది విన్న ప్రతి ఒక్కరు ఒక అమ్మాయి అయ్యుండి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? పిచ్చి ఏమైనా పట్టిందా.. లేక తేడానా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది కరీనా పై తనకున్న ఇష్టాన్ని ఆ విధంగా చెప్పుకొచ్చింది అంటూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా పాయల్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు