Bollywood: రిచెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ ఆమె..ఎన్ని కోట్లంటే..?

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు సౌత్ సినీ ఇండస్ట్రీ హీరోయిన్లతో పోల్చుకుంటే పారితోషకం విషయంలో ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి వస్తారు.. అది తక్కువ సమయంలోనే పాపులారిటీ దక్కించుకొని అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతూ ఉంటారు .అలా ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు అత్యధిక పారితోషకం తీసుకుంటూ కోట్ల రూపాయలను కూడబెట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో రిచెస్ట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారి గురించి.. వారి ఆస్తుల గురించి ఇప్పుడు చూద్దాం..

ప్రియాంక చోప్రా:
బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా రూ.625 కోట్ల ఆస్తితో అందరికంటే తానే అత్యంత ధనవంతురాలిగా రికార్డు సృష్టించింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియా.. పలు యాడ్స్ ద్వారా కూడా ఈ ముద్దుగుమ్మ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

richest-bollywood-heroines

- Advertisement -

దీపికా పదుకొనే:
బాలీవుడ్ కే పరిమితం కాకుండా హాలీవుడ్ లో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా రూ.500 కోట్ల నికర సంపాదన కలిగి ఉంది.

richest-bollywood-heroines

కత్రినా కైఫ్:
తెలుగులో మల్లీశ్వరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్లో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ రూ.500 కోట్ల ఆస్తులను కూడబెట్టింది.

richest-bollywood-heroines

మాధురి దీక్షిత్ :
బాలీవుడ్ అందగత్తెగా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ అక్షరాలా రూ .283 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉంది.

richest-bollywood-heroines

ఐశ్వర్యారాయ్:
ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలలో ఒకరిగా నిలిచిన ఐశ్వర్యారాయ్ రూ.281 కోట్ల వరకు నికర ఆస్తులను కూడబెట్టి రిచెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

richest-bollywood-heroines

అనుష్క శర్మ:
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ గా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 281 కోట్ల రూపాయలను కూడబెట్టింది.

richest-bollywood-heroines

కాజోల్ దేవగన్:
దిల్వాలే దుల్హనియా లేజాయేంగే అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తుంది. బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నికర ఆస్తుల విలువ అక్షరాల రూ.200 కోట్లు.

richest-bollywood-heroines

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు