IFFI Goa 2023: అరుదైన గౌరవం దక్కించుకున్న మాధురీ దీక్షిత్.. పోస్ట్ వైరల్.!

54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమం సోమవారం గోవాలో ప్రారంభమైంది. పనాజీలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్స్ అయినా మాధురీ దీక్షిత్, శ్రియా శరణ్, నుష్రత్ భరుచా, సన్నీ డియోల్, కరణ్ జోహార్, శంతను మోయిత్రా, శ్రేయా ఘోషల్, సుఖ్వీందర్ సింగ్ తో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యి కార్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇకపోతే సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ సేతుపతి.. రాబోయే తమ చిత్రాల ప్రోమోలను వరుసగా విడుదల చేశారు.. ఏ వతన్ మేరే వతన్, కడక్ సింగ్, గాంధీ టాక్స్. ఇదిలా ఉండగా 54వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌కు ప్రత్యేక గౌరవం లభించింది.

54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మాధురీ దీక్షిత్‌ను ‘భారతీయ సినిమాకు అందించిన సేవకు గానూ ఆమెను అత్యంత ప్రత్యేకమైన ఐఫా అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇకపోతే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ మైన సినీ ప్రయాణంలో మాధురీ దీక్షిత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇకపోతే ఈ అవార్డును మాధురి దీక్షిత్‌కు కేంద్ర సమాచార – ప్రసారాలు & యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.

మంత్రి అనురాగ్ ఠాకూర్ మాధురీ దీక్షిత్‌కు అవార్డు ఇస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఫోటోలను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు. “ప్రతి యుగానికి చిహ్నం, మాధురీ దీక్షిత్ నాలుగు అద్భుతమైన దశాబ్దాలుగా తన అద్వితీయ ప్రతిభతో మన స్క్రీన్‌లను అలంకరించారు. మాధురీ దీక్షిత్ భారతీయ చిత్రాలలో తన విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

మాధురీ దీక్షిత్ యొక్క అసాధారణ విజయాలు అలాగే భారతీయ సినిమాపై ఆమె శాశ్వత ప్రభావానికి భారత సినిమాకి చేసిన కృషికి.. ఈ ప్రత్యేక గుర్తింపు కి ఈ అవార్డు నిదర్శనం” అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా పలువురు స్టార్ సెలబ్రిటీలు అభిమానులు మాధురి దీక్షిత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు